#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

కన్ను మూశారు. మరి దీనికి పరిష్కార మేమిటా అని తీవ్రంగా ఆలోచించాలి. అదే మానవ జీవిత కర్తవ్యం.

  అయితే ఏమిటది. ఎలా సాధించాలని అడిగితే దానికే ఇప్పుడు సమాధాన మిస్తున్నాడు. తిష్ఠంతం పరమేశ్వరం అవినశ్యంతం యః పశ్యతి అని. నీవు పెద్ద పొరపాటు చేస్తున్నావు మానవుడా. చూడవలసింది నీవీ విశేషాలను గాదు. ఈ విశేషాలలోనే అధిష్ఠాన రూపంగా కూచొని ఇవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ నశిస్తూ పోతుంటే తాను మారకుండా నశించ కుండా ఉన్న పరమాత్మ తత్త్వమేదో దాన్ని చూడు చేతనైతే. అది కూడా ఎక్కడో ఏదో నని గాక నీ స్వరూపంగా అర్థం చేసుకొని చూస్తుండు. అప్పుడా దృశ్యమైన ఆత్మ ఎలా నశించదో దాన్ని పట్టుకొన్న దృగ్రూపమైన నీవు కూడా నశించవు. ఏమి కారణం. అది విశేషం కాదు నశించటానికి. సామాన్యమైనది. సామాన్య మెప్పుడయిందో నిరాకారం వ్యాపకం. అలాటిది నీ శరీరంలోనే గాదు సర్వత్ర ఉండగలదు. సర్వత్ర ఉన్న ఆ తత్త్వమే నాతత్త్వమని నీవెప్పుడు దర్శిస్తావో అప్పుడు దానితోపాటు నీవు కూడా శరీరాన్ని వదిలేసి నిరాకారమైన జ్ఞానంగా సర్వత్ర వ్యాపిస్తావు. అలా చూచుకొంటావు నీ స్వరూపాన్ని. అప్పుడీ శరీరం కాలం దీరిపోయినా నీకు భయం లేదు. విశేషంగా ఇక్కడ నశించినా సామాన్యంగా మిగతా ప్రపంచ మంతటా బ్రతికే ఉంటావు. అంటే మరణం లేని జీవితాన్నే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు