#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

తప్పదు. బల్లను చూచే చూపుతో కుర్చీని చూడము. కుర్చీని చూచే చూపుతో ఇల్లూ వాకిలీ చూడము. వాటిని చూచే చూపుతో చెట్లు చేమలు పట్టణాలూ పర్వతాలూ చూడం. అలాటి చూపు పెట్టుకొనే పశుపక్ష్యాదులనూ తోడి మానవుల శరీరాలుగా చూడం. మరి ఆ చూపుతోనే మన శరీరాన్నీ కరచరణాదులనే గాక మనస్సులోని భావాలూ చూడం. అందులో కలిగే సుఖదుఃఖా ద్యనుభావాలనూ చూడం. అంటే అలా కాకుంటే ఇది సుఖ మిది దుఃఖమని గాక రెంటినీ ఏకంగా చూడాలిసి వస్తుంది. ఏదీ అలా సమానంగా ఎవడు చూస్తున్నాడు మనలో.

  అయితే మరి మన దృక్కూ దృశ్యమూ రెండూ విశేషాత్మకమూ విభిన్నమూ అయి కూచుంటే ఇందులో ఇక విశేషం గాని పదార్ధమే లేదా. ఉంది. ఏమిటది. సమం. ఈ విశేషాలన్నింటినీ సమానంగా వ్యాపించినదే అది. సామాన్యమని పేరు దానికి. ఏమిటది. పరమేశ్వరం - దేహేంద్రియ మనోబుద్ధ్యాదులుగాక వాటి కతీతమైన దేదో అది. సచ్చిద్రూపమది. సర్వేషు భూతేషు తిష్ఠంతం. ఎక్కడో ఒక చోటగాదు. సమస్త భూతాలలో తిష్ఠ వేసుకొని ఉన్నదది. ప్రతి ఒక్కటీ ఉంది స్ఫురిస్తున్న దనేగా నీ అనుభవం. అదుగో ఈ ఉండటం స్ఫురించటమే దాని రూపం. అది ఏ పదార్ధంలో లేదో చెప్పు. జడ చేతనాత్మకమైన సృష్టినంతా వ్యాపించి ఉందది. సృష్టిలో కనిపించే ఈ పదార్ధాలన్నీ విశేషాలైతే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు