పట్టదు. ప్రధానం కాబట్టి దానినే మరలా బోధిస్తున్నాడు గీతాచార్యుడు మనకు.
సమం సర్వేషు భూతేషు - తిష్ఠంతం పరమేశ్వరం
విన శ్యత్స్వవిన శ్యం తం యః పశ్యతి స పశ్యతి 27
యః పశ్యతి స పశ్యతి. ఎవడైతే మేము చెప్పిన విధంగా చూడగలడో వాడే సరిగా చూస్తున్నవాడు. అంటే సరియైన జ్ఞానమున్నవాడు నిర్విశేషమైన జ్ఞానమే సరియైన జ్ఞానం. మామూలుగా చూస్తే ప్రపంచమంతా విశేషరూపం. పెండ్లాం బిడ్డలు ఇండ్లూ వాకిండ్లు వస్తు వాహనాలు పృధివ్యాది పంచభూతాలు వాటి వల్ల తయారైన భౌతిక పదార్ధాలు - అన్నీ ఒక్క మాటలో చెబితే విశేషాలే. విశేషాలంటే ఏమిటర్ధం. ఇదున్నట్టది ఉండదది ఉన్నట్టిది ఉండదు. దేని రూపం దానిదే. దేని గుణం దానిదే. ఏది చేసే పని దానిదే. ఒకదానిలాగా మరొకటి ఉంటుందనే మాటే లేదు. అది జడం గాని చేతనం గాని దేని పాటికదే. అసలు బాహ్యమైన పదార్ధాలే గాదు. అంతరమైన మనసూ ప్రాణమూ ఇంద్రియాలూ అవయవాలూ శరీరమూ ఇవి కూడా విశేషాలే. ఒకదానితో మరొక దానికి పోలిక లేదు. అప్పటికి ఇంటా బయటా విశేషాత్మకమే ఈ సృష్టి అంతా.
సృష్టి ఎప్పుడిలా విశేషాత్మక మయిందో అప్పుడీ సృష్టిలోని పదార్ధాలను నిత్యమూ చూస్తున్న మన దృష్టి కూడా విశేషాత్మకం గాక