దనాత్మ. తరంగాదులు సముద్రజలం కన్నా ఎలా వేరుగా లేవో మీదు మిక్కిలి అదంతా దాని విలసామేనో - అలాగే ఈ నామరూపక్రియా రూపమైన అనాత్మ జగత్తు ఆత్మకు వేరుగా లేదు. ఇలా అనాత్మ నంతా ఆత్మ తత్త్వాన్ని కనన్యంగా భావించి చూడగలగాలి సాధకుడు. మరి అన్యంగా ఈ ప్రపంచం కనిపిస్తున్నా దీన్ని మాయా నిర్మిత హస్తి స్వప్న దృష్ట వస్తు గంధర్వ నగరాకారంగా దర్శించాలని కూడా బోధిస్తారు భాష్యకారులు. అలా లేనిది లేనట్టు ఉన్నదే ఉన్నట్టు దర్శించటమే సమ్యగ్దర్శనం Right Vision. ఇలాంటి జ్ఞాన ముదయించిందో సూర్యోదయమైతే చీకటి పొరలు విరిసిపోయి నట్టే పటా పంచెలయి పోతుంది మిధ్యాజ్ఞానం. పోతే తన్నిమిత్తంగా ఏర్పడ్డ ఆధ్యాసిక సంబంధం కూడా తొలగిపోయి తన ఆత్మే సర్వాత్మ రూపంగా దర్శన మిస్తుంది సాధకుడికి. అలాంటి అద్వైతాత్మ సాక్షాత్కారమైతే చాలు. నసభూయోభి జాయతే. ఇక జన్మమృత్యు రూపమైన సంసార బంధం దానిపాటికదే సెలవు తీసుకొంటుంది.
ఏతావతా సస భూయో భిజాయతే అని సమ్యగ్ధర్శనం వల్ల మిధ్యాజ్ఞానం తొలగితే జన్మరాహిత్యమనే ఫలిత మేర్పడుతుందని తేలింది. అంతేగాక జన్మ బంధానికి కారణం అవిద్యా నిమిత్తమైన క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగమని కూడా తేలుతున్నది. అంచేత ఇంతకూ అవిద్యా నివృత్తి హేతువు సమ్యగ్దర్శనమే గనుక అది సాధకుడికెన్ని మార్లు చెప్పినా మనసుకు