కాబట్టి ఆధ్యాసికమంటారు భగవత్పాదులు. తాదాత్మ్యమని కూడా దీనికి నామాంతరం. వాస్తవం కాదిది. ఆ భాస రూపం Notional. ఒక రజ్జువుకూ సర్పానికీ ఒక రజతానికీ శుక్తికకూ ఉన్న సంబంధం లాంటిదిది. కేవలం మిధ్యాజ్ఞాన False notion నిమిత్తంగా ఏర్పడ్డ సంబంధం. ఇది ఇలా సాగిపోతున్నంత వరకూ సంసారానికి దారి తీసి అందులో నుంచి తప్పించుకోలేని సమస్య అయి మెడకు చుట్టుకొంటుందీ జీవుడికి.
అయితే మరి ఎలా ఇందులో నుండి బయట పడటమని ప్రశ్న. దాని పరిష్కార మార్గం కూడా ఈ సమస్యలోనే ఇమిడి ఉన్నదంటారా చార్యుల వారు. అదెలాగంటే ఇది వాస్తవమైన సంబంధం కాదు. కేవలం మిధ్యాజ్ఞాన నిమిత్తంగా ఏర్పడ్డదే గనుక మిధ్యాజ్ఞానాన్ని పోగొట్టు కొంటే చాలు. సత్యం బయటపడుతుంది. అప్పుడు క్షేత్రమే లేదు. క్షేత్రజ్ఞుడే మిగిలిపోతాడు. ఇక సంబంధమనే మాటే ముంది. అంతా హుళక్కే కాని మిధ్యాజ్ఞానం దాని పాటికది తొలగిపోదు. సమ్యగ్ జ్ఞాన ముదయిస్తేనే పోతుంది. సమ్యగ్ జ్ఞానమంటే క్షేత్రజ్ఞుడి స్వరూపమేమిటో దాన్ని ఉన్నదున్నట్టు గుర్తించటం. అది ఎలాగంటే అసలు జ్ఞాన స్వరూపుడైన క్షేత్రజ్ఞుడే ఉన్నాడు. అదే ఆత్మ. సచ్చిద్రూపమది. దాని విస్తారమే క్షేత్రమనే పేరుతో కనిపించే ఈ అనాత్మ ప్రపంచమంతా. అది వస్తువు - ఇది దాని విభూతి. సముద్రం వంటి దాత్మ అయితే తరంగ బుద్బుదాదుల లాంటి