#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

లేదు. పోతే శుద్ధ చైతన్యస్వరూపుడు క్షేత్రజ్ఞుడు. అతడు జడం కాదు. పరస్పర సాజాత్యమే లేదు. ఇలాటి రెండింటికీ సంబంధమంటే అది సంయోగ సంబంధమైనా కావాలి. లేక సమవాయ సంబంధమైనా కావాలి. రెండూ సావయవ Divisible మైన పదార్ధాలైతే రజ్జు ఘటాలలాగా సంయోగమనేది ఏర్పడవచ్చు. కాని ఆత్మ జ్ఞాన స్వరూపం. నిరాకారం. అది సావయవం కాదు నిరవయవం. అనాత్మ జగత్తు సావయవం సాకారం. మరి సంయోగమెలా సంభవం. పోతే ఇక సమవాయ సంబంధం. సమవాయమంటే అవినాభావ రూపమైన సంబంధం. ఒక తంతువుకు వస్త్రానికీ ఉన్న సంబంధమది. అలాంటిది కూడా కాదిది. పైగా క్షేత్ర క్షేత్రజ్ఞులకు కార్యకారణ భావమే లేదసలు. అలాంటప్పుడిక సంబంధమేమిటి.

  అయితే మరి సంయోగాత్తనే మాట ఎలా ప్రయోగించాడు గీతాచార్యుడు. చెబుతున్నాం. క్షేత్ర క్షేత్రజ్ఞులంటే విషయ విషయులు Sub, Object అంటే జ్ఞాతృ జ్ఞేయాలు Knower + known. కనుక భిన్న స్వభావులు. ఇద్దరికీ సాజాత్యం లేదు. అయినా వారి స్వరూప మిదమిత్థమని వివేచన చేయని కారణంగా ఒక దాని లక్షణాలు మరొక దాని మీద ఆరోపించటం వల్ల సంబంధం గాని సంబంధ మేర్పడుతున్నది రెండింటికీ. ఈ ఆరోపణకే అధ్యాస Imposition అని పేరు. తద్ద్వారా ఏర్పడింది

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు