పెద్దల వల్ల శ్రవణం చేస్తూ కూచోటమే. ఏదైనా అభ్యాసమే. అభ్యాసం కూసు విద్య అన్నారు. మరి అలాంటి వారే తరించగలరని చెబుతున్నప్పుడిక అంతో ఇంతో స్వయంగా వివేకవంతులైన వారి విషయం చెప్పేదే ముందంటారు భాష్యకారులు. సరే మంచిది. ఇప్పుడు క్షేత్రజ్ఞేశ్వరైకత్వ విషయమైన జ్ఞానమే మోక్ష సాధన మన్నారు గదా. అందులో ఉన్న ఉపపత్తి ఏమిటని ప్రశ్న వచ్చింది. దానికిప్పుడు సమాధాన మిస్తున్నాడు పరమాత్మ.
యావత్సం జాయతే కించి- తృత్త్వం స్థావర జంగమం
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా - త్త ద్విద్ధి భరతరభ - 26
అసలీ ప్రపంచంలో యావత్ సత్త్వం - ఏ పదార్ధమైనా సరే. అది స్థావరమే కావచ్చు. జంగమమే కావచ్చు. అంటే చరా చరా లేవైనా సరే. అవన్నీ ఎలా జన్మిస్తున్నాయో తెలుసా. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా త్సంజాయతే ఇతివిద్ధి - క్షేత్ర క్షేత్రజ్ఞు లిద్దరికీ ఏర్పడే సంయోగం వల్లనే సుమా అంటాడు. కేవల క్షేత్రం వల్ల కాదు సృష్టి. క్షేత్రజ్ఞుడి వల్లా కాదు. రెండింటి సంయోగం వల్లనే.
అయితే సంయోగ మంటున్నారు. రెండింటికీ అసలు సంయోగమనేది ఏర్పడే అవకాశముందా. సంయోగమంటే సంబంధం గదా. సంబంధమీ రెండింటికీ ఎలా ఏర్పడుతుంది. క్షేత్రమంటే జడపదార్ధం. దానికి చైతన్యం