#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  పోతే మూడవది కర్మ యోగేన చాపరే. కర్మయోగంతో కొందరు సాధన చేస్తుంటారు. మనోవాక్కాయాలతో ఏ పని చేస్తున్నా నేను గాదిది చేయటం. ఎవడో ఒక ఈశ్వరుడు నా వెనకాల ఉండి నాద్వారా నడుపుతున్నా డిదంతా. దీనికి నేను కర్తను గాను. దీని ఫలితానికి కూడా నేను భోక్తను గాను. కర్తా భోక్తా ఆ చైతన్యమే. దానికే ఇది సమర్పణమని ఈశ్వరార్పణ బుద్ధితో జీవితయాత్ర సాగిస్తూపోవటం కర్మయోగం. తద్ద్వారా సత్త్వం శుద్ధి చెంది జ్ఞానోత్పత్తి కది దారితీస్తుంది.

  పోతే నాలుగవ మార్గ మొకటున్నది. మందులు కూడా గాక అతి మందబుద్ధులకు చెప్పిన దది. వారికి బుద్ధిబలం లేదనే గాని శ్రద్ధా భక్తులు బ్రహ్మాండంగా ఉంటాయి. కనుక వారిని మన మంత తక్కువగా చూడరాదు. అన్యేత్వేవ మజానంతః ఈ ధ్యాన సాంఖ్య కర్మయోగ మార్గాలు మూడింటిలో ఏదీ వారికి తెలియకపోవచ్చు. వాటి సూక్ష్మం వారి కంతు పట్టకపోవచ్చు. కాని తమ పాటికి తమకవగాహన లేకపోయినా శ్రుత్వాన్యేభ్యః దాని విషయం బాగా తెలిసిన పెద్దలు వారి కర్ధమయ్యే భాషలో దృష్టాంత పూర్వకంగా వివరించి చెబితే ఉపాసతే. అందుకొని పోగలరు. అలాంటి వారు కూడా అతి తరంత్యేవ మృత్యుం. మృత్యురూపమైన ఈ సంసార సాగరాన్ని దాటి బయటపడగలరు. దానికి కారణం శ్రుతి పరాయణాః నిత్యమూ గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు దీక్షగా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు