#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

నాలుగు. అవి కూడా మానవులలో ఉన్న వారి వారి యోగ్యతను బట్టి చెప్పవలసి వచ్చింది. మానవులందరూ ఒకే సామర్ధ్యమున్న వారు కారు కొంద రుత్తమాధికారులు. కొందరు మధ్యములు. మరికొందరు మందులు. ఇంకా కొంద రతి మందులు. వీరందరినీ కలుపుకోటానికి నాలుగు పాయాలు చెప్పింది శాస్త్రం.

  ఇందులో ఉత్తమాధికారులైన వారికి ధ్యానమార్గం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచి దాత్మాన మాత్మనా. ధ్యానమంటే యోగులు చెప్పే ధ్యానం కాదు. అది విజాతీయ భావాలు మనసుకు వస్తుంటే వాటిని వదిలేసి మనసు నొకే లక్ష్యం మీద పెట్టటం. ఇది అలాంటి ధ్యానం కాదు. విజాతీయాన్ని కూడా సజాతీయమైన ఆత్మ భావనగా మార్చుకోటం. నిదిధ్యాసన అంటారు దీన్ని అద్వైతులు. ఇందులో ఆత్మా నాత్మ విభాగం లేదు. అనాత్మను కూడా ఆత్మగానే చూడాలి సాధకుడు. సర్వత్ర సత్తా స్థురత్తలను దర్శిస్తూ పోవటమే అసలైన ధ్యానం. ధ్యానం కాని ధ్యానం. ఇందులో మనసుకే మాత్రమూ నిర్బంధం ఒత్తిడి లేదు. అది ఎలాగో వివరిస్తున్నాడు. ఆత్మని. ఆత్మలో. ఆత్మానం. ఆత్మను. ఆత్మనా. ఆత్మతో. పశ్యంతి. చూస్తారట వారు. ఆత్మనాత్మలోనట. మరే దేవతనో ఏ నామరూపాత్మకమైన విగ్రహాన్నో మనసుకు తెచ్చుకోటం కాదని అర్థమయింది. దీనితో ఉపాసన సగు ణారాధన లెగిరి పోయాయి. ఆత్మనా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు