#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అయినా జ్ఞాని అయిన వాడికీ శరీర సంబంధం - తన్నిమిత్తంగా దుః ఖానుభవం తప్పటం లేదు గదా. అది జ్ఞానమెలా అవుతుంది. అవుతుంది. శరీరమున్నా దుఃఖానుభవమున్నా దానితో పాటు జ్ఞానానుభవం కూడా ఉంటూ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడిది దాని కాహుతి అయిపోతుంది. కనుక బంధం కాదది. మోక్షమే. లేకపోతే జీవన్ముక్తి కర్ధం లేదు. మృతికీ ముక్తికీ అసలు తేడా లేదు. అతోత్ర కాచిదా శంకాన కర్తవ్యా. తాదృగ్ జ్ఞానాయ యత్న ఏవ కర్తవ్యః పురుషేణ.

ధ్యానేనాత్మని పశ్యంతి - కేచి దాత్మాన మాత్మనా
అన్యే సాంఖ్యేన యోగేన కర్మ యోగేన చాపరే - 24

అన్యేత్వేవ మజానంతః శ్రుత్వా న్యేభ్య ఉపాసతే
తేపి చాతి తరంత్యేవ నిత్యం శ్రుతి పరాయణాః - 25

  అయితే మరి జ్ఞాన సంపాదనమే కర్తవ్యమని బోధించారు మీరు. ఆ జ్ఞాన మనేది ఎలా సంపాదించాలో ఆ మార్గ ముపదేశిస్తారా అని అడిగితే చెబుతున్నాడు వ్యాసభగవానుడు. అది ఒకటి గాదా మార్గం. నాలుగు విధాలు. నాలుగేమిటి. నాన్యః పంథా అయనాయ విద్యతే అని గదా శాస్త్రం చాటుతున్నది. నిజమే. అది మోక్షానికి. మోక్షానికి జ్ఞానమొక్కటే మార్గం. మరొక మార్గమే లేదని దాని కర్ధం. పోతే ఇది మోక్షానికి గాదు. మోక్షానికి సాధనమైన ఏ ఆత్మజ్ఞాన ముందో ఆజ్ఞాన ముదయించటానికి మార్గాలు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు