#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అలాగే మేమనుభవిస్తూ మీకూ ఆ బ్రహ్మానుభవమే లాంటిదో రుచి చూపుతున్నాము. అప్పుడే అది ద్విగుణీకృతమైన పూర్ణానుభవం. త్రిగుణీకృతం కూడా. త్రిగుణీకృతమైన ఆజ్ఞానాన్నే త్రిషట్కాలలో అందజేశా నింతవరకూ నేను.

  నేనా కాదు. నాకా అహంకారం లేదు. తగ్ హ దేవ మాత్మ బుద్ధి ప్రకాశ మన్నారు శ్వేతాశ్వతర మహర్షులు. నేనెంత వాణ్ణి. వారి విజ్ఞాన పధంలో పయనిస్తున్న వాణ్ణి. మహర్షుల బుద్ధికే ప్రకాశమా పయినుంచి సరఫరా అవుతున్నదో అదే వ్యాసభగవానుడి కదే భగవత్పాదుల లాటి మహనీయులకు. తదీయమైన విజ్ఞాన వాసనా వాసితమైన మాబోటి శిష్య పరమాణువుల బుద్ధి ప్రకాశం కూడా. మీకు దుర్గమమైన మోక్ష సాధన మార్గాన్ని స్పష్టంగా చూపగలిగితే అంతకన్నా మాకభీష్టమైనది వేరొకటి లేదు. ఒక అద్భుతమైన అద్దంలాంటిదీ అధ్యాత్మ విద్య. ఇందులో మన ముఖమే మనమవలోకిస్తాము. అవలోకించేదీ నేనే. అవలోకించబడేదీ నేనే. అసలా అద్దమూ నేనే నని గుర్తిస్తేచాలు. మీరూ ధన్యులే. మేమూ ధన్యులమే. ధన్యోహం ధన్యోహమని వేదాంత పంచదశిలో సెలవిచ్చిన విద్యారణ్యుల వారి సంతృప్తి గుర్తు వస్తుంది. ఏదైనా ఉభయతారక మైతేనే అభయ కారకం. సహనా వవతు సహనౌ భునక్తు.

సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీత మస్తు -మా విద్విషావహై

ఓం - శాంతి శ్శాంతి శ్శాంతిః

ఇతి

విబుధ జన విధేయః

శ్రీనివాస నామధేయః

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు