#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

గీతోపదేశం. అదేదో గాదా జ్ఞానం. క్షేత్రం కూడా క్షేత్రజ్ఞ స్వరూపమేనని గుర్తించటం. అది కాని భావాలన్నీ అందులో ప్రవిలయం చేసుకోటం.

ఉపద్రష్టా ఽ ను మంతాచ - భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో- దేహేస్మిన్ పురుషః పరః - 22

  మరి ఆ ఆత్మ స్వరూపమెలా ఉంటుందని అడిగితే అదేదో గాదు. నీ శరీరంలో నేనని నీవు భావించేది శరీరం మేరకే ఉన్న జీవుడు కాదది సర్వ వ్యాపకమైన పరమాత్మే ననే ఏకాత్మ భావం లేదా సర్వాత్మ భావం. అదే అసలాత్మ అనే మాట కర్థం. సర్వాత్మ అని ఎప్పుడన్నామో అప్పుడనాత్మ లేదిక. అనాత్మ అని భావించేది కూడా వాస్తవంలో ఆత్మే. అలాగైతే గాని సర్వమూ ఆత్మేననే మాట కర్థం లేదు. సర్వత్రా వ్యాపించి సర్వమూ తానే అయి ఉన్నది గనుకనే ఈ జీవ శరీరంలో కూడా జీవుడనే పేరుతో ఆ పరమాత్మే తిష్ఠ వేసుకొని వ్యవహరిస్తున్నది. అది ఎలాగో క్రమంగా వివరిస్తున్నాడు మహర్షి

  ఉపద్రష్టా నుమంతాచ - తానే పనీ పెట్టుకోకుండా దగ్గరగా కూచొని ఊరక అన్ని వ్యాపారాలనూ సాక్షిగా గమనిస్తున్న వాడెవడో వాడు పద్రష్ట. పూర్వం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఋత్విక్కులూ యజమానులూ ఆయా పనులు జరుపుతుంటే వాటి గుణ దోషాలను పరీక్షించేవాడి నా పేరుతో పిలిచేవారట. అలాగే కార్యకరణాదులు దర్శన స్పర్శనాదులు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు