#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

సుఖదుఃఖ మోహాదులని. సుఖీదుఃఖీ మూఢః పండితో హమిత్యేవం. నేనే సుఖి ని నేనే దుఃఖి ననే భావన.

  అయితే ఒక సూక్ష్మ ముందిక్కడ. సత్యామపి అవిద్యాయాం. అవిద్య అనేది ఉన్నా. సుఖదుఃఖ మోహేషు గుణేషు భుజ్యమానేషు. సుఖదుఃఖాది గుణాలు అనుభవిస్తున్నా ఆ గుణాలతో సంపర్కమే దుందో అదే ముఖ్యంగా సంసార బంధానికి మూలమయి కూచున్నది. కారణం గుణ సంగోస్య అంటున్నది గీత. సయధా కామో భవతి తత్రతు ర్భవతి యత్రతు ర్భవతి తత్కర్మ కురుతే - యత్కర్మ కురుతే తత్ఫల మభిసంధత్తే అని చెబుతున్న దుపనిషత్తు కూడా. మతెంతో గతంతా అన్నట్టు - నీ సంకల్పాన్ని బట్టే నీ క్రియా నీ క్రియను బట్టే నీకనుభవ మన్నారు. అదే చాటి చెబుతున్నా డిప్పుడు మహర్షి కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. సద్యోనులలో అసద్యోనులలో ఈ జీవుడు జన్మంచవలసి వస్తున్నదంటే ఆ జన్మలన్నింటికీ కారణమేదో గాదు. వీడీ ప్రకృతి గుణాలలో పడిపోవటమే. ఇంతకూ మన కర్ధమయిందే మంటే ప్రకృతిస్థత్వమే అవిద్య. గుణసాంగత్యమే కామం. ఈ అవిద్యా కామాలే సంసార బంధంలో పడటానికి కారణం. ఎందుకు వర్ణించినట్టిది. పరినర్జనాయ. ఇది ఇలాటి అనర్థదాయకమని తెలిసి దాన్ని వదులు కోటాని కంటారు భగవత్పాదులు. అంతే కాదు. అలా వదులుకోవాలంటే ఆత్మ జ్ఞానమూ వైరాగ్యమనేవి రెండే ఉండాలని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు