#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  ఎవరోగాదు. అది సంయోగం గాదు. సమవాయం గాదు. తాదాత్మ్య సంబంధ మంటారు అద్వైతులు. సంబంధం కాని సంబంధం తాదాత్మ్యం. కాదంటున్నారు. అయినా సంబంధ మంటున్నారు. అది ఎలాగా. జ్ఞానం నిర్గుణం. జ్ఞేయం సగుణం కాబట్టి సంబంధం కాదంటున్నాము. కాకున్నా అవి నావే నా గుణాలే నా వికారాలేనని అభిమానిస్తున్నాడీ జీవుడు. కాబట్టి అవునంటున్నాము. ఒకటి లేకున్నా ఉన్నట్టు కనపడుతున్నదంటే అది వాస్తవంగా ఏర్పడేది గాదు. అజ్ఞానం వల్ల ఏర్పడిన సంబంధమే. దీన్నే తాదాత్మ్యమనీ ఆధ్మాసికమనీ వ్యవహరిస్తారు వేదాంతులు. ఇంతకూ వాస్తవంగా ఏర్పడింది కాదు. కాబట్టి ఒక సౌలభ్యం కూడా ఉంది ఇందులో. వాస్తవమైన తత్త్వమేదో గుర్తించ గలిగితే చాలు. మరుక్షణం తొలగిపోతుంది. అప్పుడీ జీవుడికి సంసార బంధమే లేదు. అలాటి జ్ఞానోదయం కలగనంత వరకూ అది కర్తగాక పోదు. వీడు భోక్త గాకపోడు. ఈ కర్త భోక్తృ భావమే సంసారమంటే మరేదో గాదంటారు భాష్యకారులు.

పురుషః ప్రకృతి స్థాపి - భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్
కారణం గుణసంగోస్య - సదస ద్యోని జన్మసు - 21

  మరి ఈశ్వరుడి లాగా శుద్ద చిద్రూపుడైన ఈ జీవుడికి కర్తృభావం భోక్తృ భావమెందు కేర్పడిందని ప్రశ్న. దానికి సమాధాన మిస్తున్నదీ శ్లోకం. వాస్తవంలో వీడీశ్వరుడే. సందేహం లేదు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు