#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

లందరూ మందభాగ్యులే. మంద భాగ్యులంటే ఎప్పటికీ శాపగ్రస్తులయి సాయుజ్యానికే నోచుకోరని కాదు మరలా. ఇంతకు పూర్వం చెప్పినట్టు ప్రతి మానవుడి జ్ఞానమూ సహజంగా పరమాత్మ తత్త్వాన్ని అందుకోటానికి సమర్ధమే. కాని ప్రకృతి గుణాలతో కలుషితమై దానికి దూరదూరంగా ఉండిపోతున్నది. శ్రవణాదుల వల్ల సమ్యగ్ జ్ఞానాన్ని అలవరుచుకొనే కొద్దీ ఆ మాలిన్యాన్ని కడిగేసుకొని క్రమంగా పైకె దిగిపోగలడు. అలాటి ప్రయత్నం లేనంత వరకూ గుణ ప్రభావం మానవుడి మీద పనిచేస్తూనే ఉంటుంది. ఆ విషయమే బయటపెడుతున్నా డిప్పుడు మహర్షి

ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి
వికారాంశ్చ గుణాంశ్చైవ - విద్ధి ప్రకృతి సంభవాన్ - 19

  సప్తమాధ్యాయంలో వర్ణించాడింతకు ముందు రెండు ప్రకృతులున్నా యీశ్వరుడికని. అవే పరాపర ప్రకృతులు. వాటిలో అపర ద్వారా ప్రపంచ సృష్టి స్థితి సంహారాలు జరుపుతాడాయన. పర ద్వారా అందులో జీవరూపంగా ప్రవేశిస్తాడని గదా పేర్కొన్నాడు. ప్రకృతి పురుషులంటే వీరే. ప్రకృతి జగత్తు. పురుషుడు జీవుడు. విద్య నాదీ ఉభావసి. ఇవి రెండూ ఈశ్వరుడి ప్రకృతులే కాబట్టి ఆయన ఎలా అనాదో ఇవీ ఆయనతో పాటు అనాదులే. నిత్య సిద్ధమే. ఇవి రెండూ తన అధీనంలో ఉండటం మూలాన్నే ఆయన Master ఈశ్వరుడయ్యాడు. ఆయన ఈశ్వరుడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు