#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

భావః - వసతి దీవ్యతి అస్తి భాతి అనే రెండు లక్షణాలున్న ఏ సమష్టి చైతన్యముందో అదే సర్వానికీ ఆత్మ - అదే నా ఆత్మ నా స్వరూపం కూడా అనే అద్వైత జ్ఞానమున్న వాడెవడో వాడే నాకు భక్తుడంటాడు పరమాత్మ. ఏమిటా భక్తి ఎలా ఉంటుందని అడిగితే ఇంకా చక్కగా చాటి చెబుతున్నారు భాష్యకారులు. య త్పశ్యతి యత్ శృణోతి స్పృశతి వాత త్సర్వ మేవ భగవాన్ వాసుదేవః ఇత్యేవంగ్రహావిష్ట బుద్ధిః ఏదేది లోకంలో చూస్తుంటాడో ఏది వింటుంటాడో ఏది చేతితో స్పృశిస్తుంటాడో ఇంతెందుకు పంచేంద్రియాలతోనూ అంతరింద్రియమైన మనసుతోనూ ఏది గ్రహిస్తుంటాడో - అదంతా ఏదో గాదు సచ్చిద్రూపమైన భగవత్తత్త్వమే ఆత్మ స్వరూపమే అని ఒక పెద్ద భూతం తన్ను నిత్యమూ ఆవేశించినట్టు వ్యవహరించే వాడి జీవిత వ్యవహారమే భక్తి అనే మాట కర్థ మంటారాయన. అప్పుడే అది సమ్యగ్దర్శనం. అదే విజ్ఞానం. దాని ద్వారానే ఎప్పటికైనా మద్భావః అంటే పరమాత్మ భావం పడయ గలడు మానవుడని కూడా హామీ ఇస్తాడు.

  అయితే ఇలాటి జ్ఞాన నిష్టారూపమైన అనన్య భక్తి అలవడి తద్ద్వారా భగవత్సాయుజ్య రూపమైన మోక్షఫలాన్ని అందుకోవాలంటే అంత సులభం గాదు. మనుష్యాణాం సహస్రేషు అన్నట్టు నూటికి కోటికే ఉత్తమాధికారి అయిన పురుషుడికో దక్కుతుందా భాగ్యం. మిగతా మంద మధ్యమాధికారు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు