ఈ వాక్యంలో. భక్తుడని ఒక మాటా. విజ్ఞానమని ఒక మాట. ఈశ్వర భావమని మరొక మాట. ఈశ్వర భావమంటే తానే ఈశ్వరుడూ తనకన్నా ఈశ్వరుడు వేరుగా లేడనే అనుభవం. అది ఎలా వస్తుందా అనుభవమని అడిగితే విజ్ఞాయ అంటున్నాడు. జ్ఞానమే దానికి సాధనం మరేదీ కాదని చాటుతున్నదీ మాట. అయితే ఆ జ్ఞానమేమిటి. ఎలా ఉంటుందది అని మరలా ప్రశ్న వస్తే చెబుతున్నాడు మద్భక్తః అని. అంటే భక్తే ఆ జ్ఞానమని.
ఇక్కడ వస్తున్నది సందేహం. జ్ఞానమంటున్నాడు. మళ్లీ భక్తి అంటున్నాడు. ఇంతకూ జ్ఞానంతోనా ఈశ్వర సాయుజ్యం మానవుడికి లభించేది భక్తితోనా. రెండూ పేర్కొన్నాడు కాబట్టి రెండూ మార్గాలేనని శంకించవచ్చు. కాని అలాటి ఆశంకకే మాత్రమూ అవకాశం లేదిక్కడ. ఇక్కడ భక్తి అనేది మామూలుగా మనం చెప్పుకొనే భక్తి కాదు. మామూలు భక్యి అన్యమైనది. అనన్యం కాదు. ఈశ్వరుణ్ణి తన కన్యంగా చూచే భక్తి అనన్య భక్తి ఎలా అవుతుంది. అనన్యం కాకుంటే ఈశ్వరుడే తానని ఎలా భావించగలము. కాబట్టి ఈ భక్తి సగుణ భక్తి కాదు. నిర్గుణ భక్తి. భక్తి అని పేరే గాని అది జ్ఞానమే. అందుకే విజ్ఞాయ అని హెచ్చరిస్తున్నాడు. మహర్షి అంటే ఇది జ్ఞాన రూపమైన భక్తి గాని మూఢమైనది కాదు సుమా అని ఆయన హెచ్చరిక.
ఇది గమనించే భాష్యకారులు భక్తి అనే మాటనిలా వివరిస్తున్నారిక్కడ. మద్భక్తః - మయి ఈశ్వరే సర్వజ్ఞే పరమ గురౌ వాసుదేవే సమర్పిత సర్వాత్మ