#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అంచేత జ్ఞానమైనా అదే. నీ జ్ఞానానికి గోచరించే జ్ఞేయ ప్రపంచమైనా అదే. జ్ఞానంతో నీవు రేపు అందుకొందామని చూచే జీవిత గమ్యమైనా అదే. అదే ఆత్మ. అదే అనాత్మ. అదే సమస్తం. పైగా అది అది అన్నాము గదా అని ఎక్కడో నీకు దూరంగా వేరుగా ఉందని ఊహించుకొనేవు. అది ఇంకా పెద్ద పొరపాటు. మరేమిటంటారు. హృది సర్వస్య విష్ఠితం. సర్వసామాన్యంగా సర్వత్రా పరుచుకొని సర్వమూ అదే అయిన ఆ ఆత్మ మానవులమైన మన మనస్సులో వృత్తి రూపాన్ని ధరించి విశేషాకారంగా ప్రతిష్ఠితమై ఉన్నది. అంచేత నేనూ నేనే. నేను వికల్పించి చూచే నాదీ నేనేనని ఎప్పుడూ నీవు సర్వాత్మ స్వరూపంగా నిన్ను భావిస్తూ పోవాలని చాలా పెద్ద హెచ్చరిక చేస్తున్నాడీ శ్లోకం ద్వారా మహర్షి. ఇంత గొప్ప సమన్వయ మెక్కడా కనపడదు మనకు.

ఇతి క్షేత్రం తధా జ్ఞానం - జ్ఞేయం చోక్తం సమా సతః
మద్భక్త ఏత ద్విజ్ఞాయ- మద్భావా యోపపద్యతే - 18

  ఇప్పుడింతకు ముందు చెప్పిన మూడు విషయాలూ కలిపి చెబుతున్నాడు. ఏమిటా మూడూ. క్షేత్రం. మహాభూతాల దగ్గరి నుంచీ ధృత్యంతం చెప్పిన క్షేత్రం. తధా జ్ఞానం. అమానిత్వం దగ్గరి నుంచీ తత్త్వజ్ఞానార్ధ దర్శనం వరకూ చెప్పిన జ్ఞానం. అలాగే జ్ఞేయం చోక్తం. జ్ఞేయం యత్తత్తని ఆరంభించి తమసః పరమని బోధించిన క్షేత్రజ్ఞుడి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు