#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

సృష్టి అయ్యే పదార్ధాలా సృష్టించే దెలా కాగలవు. తేడా లేకుంటే సృష్టి ఎలా జరుగుతుంది. పరస్పర విరుద్ధంగా లేదా ఈ మాట. అన్నీ అదే అని ఒక మాట. అన్నింటినీ సృష్టిస్తున్నదని ఒక మాట. ఏమిటీ విడ్డూరం. ఏమీ లేదు. లోతుకు దిగి విచారణ చేస్తే వైరుధ్యమే మాత్రమూ కనిపించదు. ఎలాగ. వస్తు సిద్ధంగా అది నిరుపాధికం. కనుక అవిభక్తం. అవిక్రియం. ఆధ్యాత్మికమని అద్వైతుల సమన్వయం. తదేజతి తన్నెజాతి అనే ఉపనిషద్వాక్య మెలాంటిదో అలాంటిదే ఇదీ. రెండు మాటలు వేదాంతంలో ఎక్కడ వచ్చినా ఒకటి వస్తు రూపాన్ని బట్టి మరొకటి దాని ఉపాధిని బట్టి చెప్పినట్టు భావించాలి మనం. అప్పుడు వైరుధ్యం తొలగిపోతుంది. విరోధా భాసే గాని విరోధం కాదని మనకు తెలిసిపోతుంది. సర్వతః పాణి పాదం దగ్గరి నుంచీ ఇదే వరస. ఉపాధులు లేని శుద్ధమైన స్వరూపాన్ని వర్ణిస్తుంటుంది గీత. దాన్నే నామరూపాద్యుపాధులు చేర్చి అలా కూడా పేర్కొంటుంది. దీన్నిబట్టి మన మర్ధం చేసుకో వలసిందేమంటే ఒకే ఆత్మ చైతన్యం నిరాకారంగా సాకారంగానూ రెండు విధాలుగా కూడా ఉండగలదు. అందులో నిరాకారంగా ఉండటం దాని స్వరూపమని సాకారంగా భాసించటం దాని విభూతి అని గ్రహించాలి. స్వరూప విభూతులు మరలా ఒకే తత్త్వమని కూడా సమన్వయించుకోవాలి.

జ్యోతిషా మపిత జ్యోతి సమసః పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం - హృది సర్వస్య విష్ఠితమ్ - 17

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు