నిత్యం విజ్ఞాతం Mere Existance స్ఫురత్తా మాత్రమే More Consciousness గదా అని సామాన్యరూపంగా చూచే ప్రజ్ఞావంతులకు అనాయాసంగా మనసుకు స్ఫురిస్తుందా తత్త్వం.
దూరస్థం చాంతి కేచతత్. అలాటి సూక్ష్మం గుర్తించే తెలివితేటలు
లేవు గనుకనే అజ్ఞానుల కది చాలా దూరమయి పోయింది. దానిపాటికది
అక్కడే ఉన్నా వీడి దృష్టి కది దూరమయినట్టు తోస్తున్నది. ఆకాశమిప్పుడంతే
గదా. ఆకాశమంటే అదేమిటో ఎక్కడో ఉందను కొనే పామరుడి కంటికది
కొన్నివేల మైళ్లు పైన ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ప్రాజ్ఞుడైన వాడీ చుట్టూ
ఉన్న ఖాళీయే గదా ఆకాశమనుకొంటే వాడికెక్కడ బడితే అక్కడే
కనిపిస్తుంటుం దాకాశం. అలాగే దాని సంగతి పూర్తిగా తెలియక
ఆకాశంలాగానే అతి దూరంగా ఏ వైకుంఠంలోనో కైలాసం లోనో ఉన్నదా
పరమాత్మ అని భావిస్తుంటారు నూటికి 99 మంది లోకులూ - శాస్త్రజ్ఞులూ
కూడా. వారికది వర్ష సహస్ర కోట్యాపి అప్రాప్యం. ఎన్నివందల వేల
సంవత్సరాలు ప్రయాణం చేసినా రోదసీ రేఖలాగా అందుకో లేరు దాన్ని.
దూర దూరంగానే ఉండి పోతుందది. అది ఎక్కడో లేదు మన స్వరూపమే
గదా - నేనే గదా ఆ ఉన్నానని భావిస్తున్నది. సర్వమూ ఉన్నదని భావించేది
కూడా ఈ నేనే గదా అని అర్థం చేసుకొనే వాడికంతా ఆత్మే. అంతా తన
స్వరూపమే.
అవి భక్తంచ భూతానాం విభక్త మివచ స్థితం
భూత భర్తృచ తద్ జ్ఞేయం గ్రసిష్టు ప్రభవిష్ణుచ - 16