#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

గుర్తించవచ్చుగా. ఎందుకని గుర్తించ లేక దానికోసం ప్రయాసపడ వలసి వస్తున్నదని ప్రశ్న వస్తున్నది. ఈ ప్రశ్న భాష్యకారులే వేసుకొని తానే సమాధానం చెప్పుకొంటున్నారు. సత్యం సర్వాభాసంతత్. సమస్త వస్తుజాతంగా అదే భాసిస్తున్నది. సందేహం లేదు. తధాపి వ్యోమవత్ సూక్ష్మం. అయినా కూడా ఆకాశంలాగా అతి సూక్ష్మమై కూచున్నదది. సూక్ష్మ త్వాత్తదవిజ్ఞేయం. అంత సూక్ష్మమయ్యే సరికది ఎవరికీ అంతుపట్టటం లేదు. అవిజ్ఞేయమంటే ఇదమిత్థామని గుర్తు చిక్కటం లేదంటారు. ఎవరికీ అంతు చిక్కకుంటే ఎలాగా. ఎప్పటికది గోచరించేది ఎప్పటికీ మానవుడు తరించేదని మరలా ఆ శంక. అవిదుషాం. దాని మర్మం ఛేదించి పట్టుకొనే సూక్ష్మం తెలియని వారికంటారాయన. ఏ విషయమైనా అంతే గదా. సంగీతంలో శ్రుతిలయలని ఉన్నాయి. ఇది శ్రుతి శుద్ధంగా ఉందీ పాట - లయబద్ధంగా ఉందంటాడొకడు. మరొకడా శ్రుతి ఏమిటో లయ ఏమిటో ఏ మాత్రమూ గుర్తించలేడు. అది ఒక రహస్యం. తెలిసిన వాడికి తెలుసు. తెలియనివాడికి తెలియదు. అలాగే ఇక్కడా అవిద్వాంసులకు తెలియదీ రహస్యం. చూస్తున్నా ఆ చూచేది నామం రూపం క్రియగా కనిపిస్తుందే గాని వాడి కక్కడే పరుచుకొని ఉన్న సత్తా స్ఫూర్తు లేమాత్రమూ అవగాహనకు రావు. కాని విదుషాంతు. దాని సూక్ష్మం తెలిసిన వారికి మాత్రం ఆత్మై వేదం బ్రహ్మై వేద మిత్యాది ప్రమాణతః

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు