#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  అలాగే నిర్గుణం గుణభోక్తృచ. దానికి సత్త్వాది గుణాలేవీ లేకపోయినా సత్త్వరజస్తమో గుణాలే శబ్దాదుల ద్వారా సుఖదుఃఖ మోహాత్మకంగా మారితే వాటిని భోక్తృరూపంగా మన శరీరంలో చేరి అనుభవిస్తున్న దంటారు స్వామివారు. కర్తాభోక్తే జీవుడనే మాట కర్థం. భోక్తగా అనుభవిస్తున్నది అదేనని ఎప్పుడన్నామో అప్పుడిక ఈ జీవుడే లేడని తెలిసిపోయింది. జీవుడు గాదు కర్త. జీవుడు గాదు భోక్త. జీవుడనే వేషం వేసుకొని శరీరమనే మరొక వేషంలో ప్రవేశించి శబ్దాదుల వల్ల కలిగే సుఖదుఃఖాదులనే మరొక వేషాన్ని అనుభవిస్తున్నదీ నటిస్తున్నదీ వేషాలు కావు. ఈ వేషాలలో దాగి ఉన్న వేషధారి ఆ ఈశ్వరుడే సుమా అనే పరమ సత్యాన్ని గుర్తు చేస్తున్నదీ గీతా వాక్యం మనకు.

బహిరంతశ్చ భూతానా- మచరం చరమేవచ సూక్ష్మత్వాత్త ద విజ్ఞేయం - దూరస్థంచాంతికే చతత్ - 15

  అంతేకాదు. ఆ ఈశ్వరుడనే అధిష్ఠాన మెంత సర్వవ్యాపకమైనదో దాని వ్యాప్తిని సర్వత్రా చూపుతున్నా డిప్పుడు గీతాచార్యుడు. ఏది వ్యాపకమో అది అధిష్ఠానం. అదే సత్యం. పోతే ఏది దానిచేత వ్యాపించబడుతుందో దాని వ్యాప్తి కవకాశమిస్తూ పోతుందో - అది దాని ఆభాస. ఆభాసలోనే అనేకత్వం. దాన్ని వ్యాపించిన సత్యమనేకం కాదు. అది ఎప్పుడూ ఏకమే. ఏకం గాకుంటే అది ఈ అనేకాన్ని వ్యాపించలేదు. వీటన్నింటినీ అదే వ్యాపించి వీటిలోనే పరుచుకొని ఉంది గనుకనే వీటిలో దేన్ని తడవి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు