#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

మరణాది క్రియలుగా మనకు భాసిస్తున్నాడు. అలా భాసిస్తున్నదిది గాదు. వాడు. ఇది దాని పాటికిది అసత్యమే. అసత్యమైతే ఎలా కనిపించింది. సత్యమైన ఆ ఐంద్రజాలికుడి శక్తి అలాంటిది. వాడే వాడి శక్తి వల్ల ఇలా వ్యక్తమై కనిపిస్తున్నాడు. ఇందులో వాడు వాడి శక్తి మాత్రమే వాస్తవం. శక్తి ద్వారా వాడు బయటపడి కనిపించేదంతా ఆభాస. ఇది వాడి అస్తిత్వాన్ని చూపటం వరకే గాని అంతకు మించి ఇది కూడా ఆస్తి అని మనం బోల్తా పడటానికి గాదు.

  ఇదంతా మనసులో పెట్టుకొనే భాష్యకారులు సర్వేంద్రియో పాధి గుణాను గుణ్య భజన శక్తిమత్ మన ఈ శరీరేంద్రియోపాధి గుణాలన్నింటికీ అనుగుణంగా భాసించే శక్తి దానికుంది. ఆశక్తి మూలంగానే ఇన్ని రూపాలుగా ఇన్ని వ్యాపారాలుగా ఆ ఈశ్వర చైతన్యమొక ఐంద్రజాలికుడి లాగానే మనకు భాసిస్తున్నది. దానికి వేరుగా చూస్తే ఇది ఒక ఇంద్రజాలంలాగా అవాస్తవమే. అవాస్తవమైనా వాస్తవమైన ఐంద్రజాలికుడి శక్తే వ్యక్తమయి కనిపించినట్టు కనిపించి ఆ వాస్తవమైన ఐంద్రజాలికుణ్ణి చూపుతున్నట్టు నామరూపాత్మకమైన ఈ జగత్తనే ఉపాధి కూడా అసలు తన పాటికి తాన సత్యమైనా ఆ ఈశ్వరుడే ఇలా భాసిస్తూ ఈ ఆభాస ద్వారా తన స్వరూపాన్ని బయటపెడుతున్నాడు. కాబట్టి ఎంత అసత్యమైనా ఇదే సత్యమైన పరమాత్మను పట్టుకోటానికి స్వానుభవానికి తెచ్చుకోటానికీ ఆధారం. కారణం ఆ పరమాత్మ శక్తి వ్యక్తమై ఏర్పడినదే ఈ ఉపాధి వర్గం. కాబట్టి వ్యక్తమైన ఈ ఉపాధి అవ్యక్తమైన ఆశక్తేనని అవ్యక్తమైన ఆ శక్తి ఏదోగాదు మరలా తదధిష్ఠానమైన చైతన్యమేనని అర్థం చేసుకోటమే ఈ ఆధారం వల్ల మనమందుకొనే ఫలితం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు