అయితే ఒక హెచ్చరిక. క్షేత్రమనే ఉపాధి గుణాలన్నీ క్షేత్రజ్ఞుడి కధ్యారోపం చేసి సర్వతః పాణి పాదమని వర్ణించాము గదా అని నిజంగానే ఇవన్నీ ఆ ఈశ్వరుడికి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని మరలా భ్రాంతి పడరాదు మనం. ఎందుకంటే అవి ఈశ్వర చైతన్యానికి సహజంగా వస్తుసిద్ధంగా లేవు. అది ఎప్పుడూ నిరాకారమే. నిశ్చలమే. వ్యాపకమే. ఉపాధి రహితమే. అయినప్పటికీ దాని మాయా శక్తి Supreme power మూలంగా ఇవన్నీ దానికున్నట్టు ఉండి ఆయా పనులు చేస్తున్నట్టు కేవలం భాసిస్తున్నది. అదే అసలు తన శక్తి ప్రభావంతో అనేక శరీరాద్యుపాధులుగా భాసిస్తూ తద్వారా ఆయా వ్యాపారాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ఆభాసే గాని Appearance వాస్తవంగాదు. అందుకే సర్వేంద్రియ గుణాభాస మంటున్నది గీత. ఏవో ఇంద్రియాలున్నట్టు అవన్నీ ఆయా కార్యాలు నిర్వర్తిస్తున్నట్టు నీకిలా భాసిస్తున్నదే గాని వస్తుతః ఏ ఇంద్రియాలూ ఏ గుణాలూ ఉన్నాయనీ గాదు. ఆయా వ్యాపారాలు వాటికున్నాయనీ గాదు. ఆయా ఉపాధుల Media రూపంగా అదే బయటపడుతున్నది. భాసిస్తున్నది. ఆయా వ్యాపారాలన్నీ నిర్వహిస్తున్నట్టు కనిపిస్తున్నది. కనిపించటం వరకే ఇది. ఇప్పుడొక గారడీ వాడు మన సమక్షంలోనే తన ఇంద్రజాలం ప్రదర్శిస్తుంటాడు. ఆకాశంలోకి ఒక పగ్గం విసిరేసి అది అలాగే నేలమీద నిలిచి ఉంటేదాన్ని పట్టుకొని ప్రాకిపోతుంటాడు. చచ్చి క్రిందబడి మళ్లీ బ్రతికి లేచి నిలుచుంటాడు. ఇదంతా వాడు ప్రదర్శిస్తుంటే మనం చూస్తున్నామా లేదా. కాని చూస్తున్న మాత్రాన ఇది యధార్ధమా. కాదు. యధార్ధంగా ఉన్నదా ఐంద్రజాలికుడే. మరి ఇదేమిటి. ఇది వాడి ప్రదర్శన. వాడే ఈ పగ్గంగా ఈ పగ్గం పాకిపోయే పురుషుడిగా వాడి జనన