#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అవయవాలూ ఇంద్రియాలూ లోకంలో మనం చూస్తున్నమో అవన్నీ ఆయా ప్రాణులవి కావు. ప్రాణులందరూ తమవే నని అభిమానించే శిరః పాణి పాదాదులన్నీ నిజానికి వీరివిగావు. ఆ క్షేత్రజ్ఞుడివే. ఆయన ఉపాధులివన్నీ. ఈ కనిపించే ఉపాధులే కనిపించని ఆ ఈశ్వరుడి అస్తిత్వాన్ని మనకు నిరూపిస్తున్నాయి. క్షేత్రమనే ఉపాధి ద్వారానే క్షేత్రజ్ఞు డయ్యాడసలు. క్షేత్రమనేది కరచరణా ధ్యవయవాలతో అనేక విధాలుగా విభక్తమయి కనిపిస్తున్నది. క్షేత్రానికి చెందిన ఈ ఉపాధుల వల్ల కనిపించే విశేషాలన్నీ క్షేత్రజ్ఞుడికి సహజంగా లేవసలు. అది ఏ ఉపాధులూ లేని పరిశుద్ధమైన చైతన్యం. అలాంటి దానికే ఉపాధి ఉందని చెప్పినా అది మిధ్యాభూతమే. వాస్తవం కాదు. కాకపోయినా ఎందుకివన్నీ దానికున్నాయని పేర్కొనటమని అడగవచ్చు. ఉపాధి వల్ల ఏర్పడిన దంతా తనపాటికది మిథ్యా భూత False మైనా సత్యమైన ఆత్మ పదార్థమొకటి ఉందని దాని అస్తిత్వాన్ని గుర్తించటానికి పనికి వస్తుంది. అందుకే దానికివన్నీ ధర్మా Attributes లయినట్టు కల్పించి వర్ణిస్తారు. అలా లేని గుణా లారోపించి చెప్పటం అద్వైత సంప్రదాయ మంటారు భాష్యకారులు.

  అధ్యారోపాప వాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అని సంప్రదాయజ్ఞులు చెప్పిన మాట కూడా ఉదాహరిస్తారు. ఏది సత్యమో అది నిర్గుణంగా ఉన్నంతవరకూ మానవుడి అనుభవానికి రాదు. అంతే కాదు. అది అసలు ఉన్నట్టు కూడా తెలియదు. ఉందని దాని అస్తిత్వాన్ని ముందు గుర్తించాలంటే గుణాల ద్వారానే గుర్తించాలి. కనుకనే దానికి సహజంగా లేకపోయినా మొదట దానికీ గుణాలన్నీ ఆరోపించవలసి ఉంటుంది. ఆరోపిస్తే ఇవి దానికెప్పుడూ అవినాభావంగా ఉంటాయని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు