#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

సత్తన వలసి ఉంటుంది. కారణరూపంగా అసత్తు. కార్యరూపంగా సత్తు. అసత్తంటే అసలే లేని పదార్ధమని అపోహ పడరాదు. అసత్తంటే ఇక్కడ అవ్యక్తమని అర్థం చేసుకోవాలి మనం. అలాగే సత్తంటే వ్యక్తమని గ్రహించాలి. ఇలా వ్యక్తా వ్యక్తరూపంగా ఉన్న దొకే ఒక తత్త్వం కాబట్టి అవ్యక్తరూపంగా అసత్తని వ్యక్తరూపంగా సత్తనీ పేర్కొనవలసి వచ్చింది. ఇదీ ఇందులో ఇమిడి ఉన్న ఉపపత్తి.

  పోతే ఇంత పెద్ద లోతుకు దిగి ఈ అద్వైత భావాన్ని ఎవడంటే వాడర్ధం చేసుకోటం కష్ట సాధ్యం. అలా చేసుకోలేక నూటికి తొంభయి మంది మనోవాగతీతమైన ఆ తత్త్వాన్ని లేదు పొమ్మని త్రోసిపుచ్చినా ఆశ్చర్యం లేదు. అలాగే గదా దాని అస్తిత్వాన్ని ఒప్పుకోక చాలామంది హేతువాదులూ నాస్తికులూ అయిపోవటం. కాబట్టి వారందరికీ నచ్చజెప్పటానికి వ్యాసభగవానుడు దాన్ని నిరుపాధికంగా గాక సోపాధికంగా వర్ణించి చూపుతున్నా డిప్పుడు. నిరుపాధికమైతే కనపడదు గాని ఏ పదార్ధమైనా సోపాధికమైతే కనపడుతుంది. కనపడిందో ఇక ఎవడైనా ఉందని ఒప్పుకోక తప్పదు. అది ఎలాగో వర్ణిస్తున్నాడు వినండి.

సర్వతః పాణి పాదంత- త్సర్వతోక్షి శిరోముఖం
సర్వతః శ్రుతిమ ల్లోకే - సర్వమావృత్య తిష్ఠతి - 13

  సర్వతః పాణిపాదం తత్ - అన్నివైపులా కాళ్లూ చేతులేనట దానికి. సర్వతోక్షి శిరోముఖం. అన్నివైపులా శిరస్సులూ ముఖాలూ కళ్ళూ. సర్వతః శ్రుతిమత్. అన్నివైపులా చెవులేనట. లోకే. లోకమంటే ప్రాణి ని కాయమని అర్థం వ్రాస్తున్నారు భగవత్పాదులు. ప్రాణుల శరీరాలలో ఏయే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు