
గ్రహించవలసిన జ్ఞానమంటూ లేదో అలాటి జ్ఞానం బోధిస్తున్నానంటాడు భగవానుడు. అంతే కాదు. యద్ జ్ఞాత్వా మృతమశ్నుతే మోక్ష్యసే అశుభాత్. ఏది తెలిస్తే నీకిక జనన మరణ ప్రసక్తే లేదో మోక్షమే లభిస్తుందో అలాటి జ్ఞానమంటాడు. ఇలాటి జ్ఞాన మేశాస్త్రమిస్తుంది. ఏ కళ ఇస్తుందో చెప్పండి. ఆఖరుకే ధర్మానుష్ఠాన మిస్తుందో చెప్పండి. ఏదీ ఇవ్వలేదు. జనన మరణ భయం లేని నిత్యసుఖదాయకమైన విద్య నేది మనకు బోధించగలదు. తాత్కాలికమైన వినోదమూ విజ్ఞానమే ఏది మన కందించినా. ఐహిక విద్యలైనా అంతే. ఆముష్మికమైనా అంతే. అక్కడి కాగిపో వలసిందే.
కాబట్టి భగవద్గీత జ్ఞానమని పేర్కొన్నదంటే అది అనన్య సామాన్యమైన బ్రహ్మజ్ఞానం. సంపూర్ణమైన జ్ఞానమది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య. మానవ జాతికంతా ధైర్యమిచ్చే మహాజ్ఞానం. అంతే కాదు. అలాటి జ్ఞానం కేవలం మానసికంగా అభ్యసించటం వరకే గాదు. కర్మణ్య కర్మ అకర్మణి కర్మ. ప్రతిక్షణమూ మానవుడు చేసే మనోవాక్కాయ వ్యాపారాలన్నిటి లోనూ అదే తొంగిచూడాలి. దాని విభూతిగానే దర్శించాలి జీవితమంతా నని కూడా గొప్ప సలహా ఇస్తున్నది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ ఏ పని చేస్తున్నా ఏ పదార్ధం చూస్తున్నా అదంతా జ్ఞాన విభూతే జ్ఞాన ప్రసరణే అని చెప్పటమెంత గొప్ప మాట. అప్పటికి జ్ఞానం వేరు - జీవితం వేరు
Page 543
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు