ముక్త సంగో సహం వాదీ ధృత్యు త్సాహ సమన్వితః
సిద్ధ్యసి దోర్నిర్వికారః - కర్తా సాత్త్విక ఉచ్యతే - 26
కర్మ చేసే తలంపే గాక ఆ సంకల్పంతో చేసే కర్మేగాక ఆయా కర్మ లాచరించే కర్త కూడా ఉంటాడు గదా. కర్త లేకుండా కర్మ చేయట మెలా సంభవం. అలాటి కర్త ఎవడో గాదు. మనబోటి జీవులమే. కర్తా భోక్తా ఇదే జీవుడి చిరునామా. వీరిలో సాత్త్వికుడైన కర్త ఎలా ఉంటాడంటే ముక్తసంగః అనహం వాదీ - నేనీ పనికి కర్తనని అహంకారంతో ముందుకు పడకుండా నాదే ముందని కర్తృత్వ బుద్ధిని వదిలేసిన వాడూ. అలాగే సిద్ధ్య సిద్ధ్యాస్సమో భూత్వా. ఆ చేసే పని తప్పక నెరవేరాలని నెరవేరకుంటే ప్రాణత్యాగం చేయాలసి ఉంటుందని పంతగించకుండా ఫలితమెలా జరిగినా రెండింటికీ తయారయి ఎలాటి వికారమూ లేని వాడూ ఎవడో కర్తా సాత్త్వికః - వాడు సాత్త్విక స్వభావమున్న కర్త. ఇందులో ధృత్యుత్సాహ సమన్వితః అనటంలో మానసికం గానూ అనహంవాదీ అనటంలో వాచికంగానూ నిర్వికారః అనటంలో శారీరకంగానూ ఎలాటి ఒడుదుడుకులూ లేని సౌమ్య స్వభావం మనకు స్ఫురింపజేస్తున్నాడు మహర్షి అలా త్రికరణ శుద్ధితో కర్మాచరణ శీలుడెవడో వాడే సాత్త్వికుడు.
రాగీ కర్మ ఫలప్రేప్సు -ర్లు బ్లో హింసాత్మకో ఽ శుచిః
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః - 27
Page 452