#


Index

మోక్ష సన్న్యాస యోగము

నిరహంకారుడూ వినయపరుడూ అని అంటామా లేదా. అలాంటి నిరహంకారం కాదిది. ఆమాటకు వస్తే వినయశీలుడైనా సాహంకారుడే వాడు. కారణ మాత్మ జ్ఞానం లేదు వాడికి. కాబట్టి ఆత్మజ్ఞాన గంధం లేకుండా దేహాభిమానంతో నేను నేను అని చేసే ప్రతివాడూ సాహంకారుడే గాని నిరహంకారుడని అపోహ పడరాదు మనం.

అనుబంధం క్షయం హింసా మనపేక్ష్యచ పౌరుషం
మోహా దారభ్యతే కర్మ - యత్త త్తామస ముచ్యతే - 25

  ఇక తామసమైన కర్మ ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. అనుబంధమంటే తరువాత రాబోయే పరిణామం Consequence క్షయమంటే శక్తి క్షయం. అర్థం ప్రాణం ధారబోసి చేయటం. హింసాం. నీవు చేసే పనివల్ల ఇతరులకు బాధ కలిగించటం. వారు తోడి మానవులే గాదు. ఏ ప్రాణులైనా సరే. వారికి హాని కలగటం. అనపేక్ష్యచ పౌరుషం. అసలీ పని నేను సాధించగలనా లేదా అని తన శక్తి సామర్థ్యాలు చూచుకోకుండా అన్నిటికీ సై అని ముందుకు దూకటం. మోహాదారభ్యతే కర్మ. ఇలా అవివేకంగా ఏపని పూనుకొని నీవు ప్రారంభించినా అది తామస కర్మే గాని మరేదీ గాదు. ఇక్కడికి కర్మ త్రైవిధ్యం కూడా వర్ణించట మయింది. పోతే ఇక కర్తలో ఉండే త్రైవిధ్యమేమిటో అది వరుసగా ఉదాహరిస్తున్నాడు గీతాకారుడు.

Page 451

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు