సాత్త్వికమైన జ్ఞానాని కనుగుణమైనదే సాత్త్వికమైన కర్మ. నియతం సంగరహితం – నీకేది శాస్త్రం విధించిందో అది నియతమైనది. నిత్యకర్మాదిక మని అర్థం. అది కూడా కర్తృత్వమనే సంగం పెట్టుకోకుండా చేయాలి. కర్తృత్వం లేకుంటే అరాగద్వేషతః కృతం - రాగద్వేషా లెగిరి పోతాయి. అఫల ప్రేప్సునా. ఫలితం నాకుకావాలని ఆసించినప్పుడే దానిమీద రాగం. దానికెవడైనా విఘాతం కలిగిస్తే ద్వేష మేర్పడుతుంది. ఫలేచ్ఛ లేకపోతే ఏదీ లేదు. ఎటూ మొగ్గు చూపవు. ఉదాసీనంగా ఉంటుంది నీ స్వభావం. అలాటి దృష్టితో ఏ కర్మ చేసినా అది సాత్త్వికమే అనిపించుకొంటుంది.
యత్తు కామేప్సునా కర్మ- సాహం కారేణ వా పునః
క్రియతే బహులాయాసం - తద్రాజసము దాహృతమ్ - 24
ఇక రాజసమేదో తెలుసా. కర్మ ఫలం మీద వల్లమాలిన అభిమానం పెట్టుకొని సాహంకారేణ. అలాటి మమకారంతో పాటు నేను చేస్తున్నాననే అహంకారం కూడా తోడు చేసుకొని బహులాయాసం. ఎంతో శ్రమపడి ఎన్నో కష్టాల కోర్చి ఎలాగైనా ఈ పని నాకు సానుకూలం కావాలని చేసే కర్మ ఏదుందో తద్రాజసం. అది రాజసమైన కర్మ. ఇక్కడ ఒక సూక్ష్మముంది. నిరహంకార అనటంలో అహంకారం లేదనే అర్థమైనా అది లోకంలో ఒక శ్రోత్రియుణ్ణి కూడా నిరహం కారుడనే పేర్కొంటాము మనం. నిరహంకారః అయం బ్రాహ్మణః పాపమీ బ్రాహ్మణుడెంత
Page 450