#


Index

మోక్ష సన్న్యాస యోగము

చూచిందే ఈశ్వరుడూ. మరెక్కడా లేదు ఆత్మ. మరెక్కడా లేడీశ్వరుడని వారి భావన. జైనులు దేహం మేరకే ఆత్మ ఉందని చూచారంటే వారికి దేహ పరిమాణమే ఆత్మ అయి కూచున్నది. అలాగే భక్తులందరూ ఏ క్షేత్రంలోనో ఏ తీర్థంలోనో ఏ విగ్రహంలోనో దేవుడని చూస్తున్నారంటే వారి దేవుడంత వరకే పరిమితుడయి పోయాడు. అహైతుకం హేతుబద్ధం కాని జ్ఞానమిది. ఎంత

  హేతు దూరమే కాదు. అతత్త్వార్ధవ దల్పంచ. అసలు యధార్ధంగా కాదు కూడా. ఆ భాసను పట్టుకొని అదే యధార్ధమని బోల్తాపడుతున్నాడు వాడు. విశేషాన్నే సామాన్యమని అక్కడికే ఆగిపోతున్నాడు. అది అల్పం గాక వ్యాపకమెలా అవుతుందా జ్ఞానం. అందుకే తత్తామసముదాహృతం. తామస జ్ఞానమని దానికి పేరు పెట్టాము. పట్టుకొన్నదీ అల్పమే. దానివల్ల వాడాసించే ఫలమూ అల్పమే. కనుక ఇది అసలే పనికిరాని జ్ఞానం. స్వర్గాది సుఖాలు ప్రాప్తిస్తే ప్రాప్తిస్తాయేమో గాని అపవర్గమనేది మాత్రం కలలోని వార్త.

నియతం సంగరహిత మరాగ ద్వేషతః కృతం
అఫల ప్రేప్సునా కర్మ - యత్త త్సాత్త్విక ముచ్యతే - 23

  ఇక్కడికి జ్ఞాన విషయమయింది. పోతే ఇక రెండవదైన కర్మ విషయం. ఇందులో కూడా సాత్త్విక రాజసాది విభాగముంది గదా. అందులో మొదట

Page 449

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు