#


Index

మోక్ష సన్న్యాస యోగము

సచ్చిద్రూపమైన తత్త్వాన్ని చూడటం లేదు. సూత్రం లాంటి దాతత్త్వం. సూత్రం లేకుండా పూసలు గ్రుచ్చబోతే హారమెలా కనపడుతుంది నీకు. పూసలే దేనిపాటికది చెల్లా చెదరయి కనపడుతుంటాయి. అలాగే చరాచర పదార్ధాలు విభక్తంగా అనేకంగానే తప్ప ఏకంగా అవిభక్తంగా అవగాహనకు రావు. దీనికి రాజసమైన జ్ఞానమని పేరు. ఏకం సద్విప్రా బహుధా వదంతి ఇంద్రం యమం వరుణమన్నట్టు ఒకే పరమాత్మ పరమాత్మగా గాక ఇంద్రాది దేవతలుగా బ్రహ్మాది త్రిమూర్తులుగా స్త్రీ పుం రూపంగా ఒక్కొక్క భక్తుడికీ ఉపాసకుడికీ ఒక్కొక్క దేవతగా సాక్షాత్కరిస్తున్న దంటే ఇదుగో ఈ రాజసమైన జ్ఞానమే దానికి కారణం.

యత్తు కృత్స్నవ దేకస్మిన్ - కార్యే సక్త మహైతుకం
అతత్త్వార్థవ దల్పంచ- తత్తా మన ముదాహృతమ్ - 22

  రాజసమైనా కొంచానికి కొంచెం నయమేమో. తామసం మరీ అన్యాయం. కృత్స్న వ దేకస్మిన్ కార్యేసక్తం. ఎందుకంటే వారి దృష్టి ఒకే చోట దిగబడి పోతుంటుంది. ఎక్కడ తగులుకొంటుందో దృష్టి అక్కడే సమస్తమూ ఉందని - అది తప్ప మరొకటేదీ లేదనీ - భావిస్తుంటారు తామస జ్ఞానులు. కార్యమంటే అది దేహం కావచ్చు. దేహానికి బాహ్యంగా విగ్రహమో పటమో క్షేత్రమో తీర్థమో కావచ్చు. ఏతావా నేవ ఆత్మా ఈశ్వరోవా నాతః పరం - ఈ శరీరంలో ఉన్న నేననే భావమే ఆత్మ - ఈ విగ్రహంలో

Page 448

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు