#


Index

మోక్ష సన్న్యాస యోగము

  కాబట్టి సచ్చిత్తు లాత్మ అయితే దాని విశేషాలే ఈ అనాత్మ ప్రపంచం. అది సూర్యమండలం. ఇవి దాని కిరణాలు. అదే ప్రసరించి ప్రకాశమయింది. ప్రసరణ అనేక రూపాలుగా విభక్తమై కనిపించినా అవిభక్తంగా అది ఒకే ఒక ప్రకాశం. అలాగే విశేషరూపంగా నామరూపాలు కనిపించినా అవిభక్తంగా అది కేవల చైతన్యమే. ఇవి ఎప్పటికప్పుడు వ్యయమయి పోయినా అది వీటి భావాభావాలు రెండింటినీ వ్యాపించిన తత్త్వం కాబట్టి అవ్యయమే. ఎటు వచ్చీ వీటిని బట్టి వీటి ద్వారా దాన్ని పోల్చుకొని అదే ఇన్ని వేషాలు వేసుకొని భాసిస్తున్నదని దీన్నీ దాన్నీ కలిపి పట్టుకొని చూడటమే జ్ఞానం. సాత్త్వికమైన జ్ఞానం. అదే ఈక్షతే అనే మాట కర్థం.

పృథ క్ష్వేనతు యద్ జ్ఞానం నానా భావాన్ పృథ గ్విధాన్
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ - 21

  అలా ఏకంగా కాక పృథక్త్వేన నానా భావాన్ వేత్తి సర్వేషు భూతేషు. చరా చర పదార్ధాలన్నింటిలో దేనిపాటికదే ఉంది. దానికదే నాకు స్ఫురిస్తున్నదని - ఎక్కడి కక్కడ అనేకంగా అనేక విధాలుగా చూస్తూ పోయావనుకో. అప్పుడా జ్ఞానమూ అనేకమే. భిన్నమే. దాని ననుసరించి నీవు చూచే పదార్ధాలూ అనేకమే. పరస్పర విలక్షణమే. కారణ మన్నింటినీ ఒకటిగా చూడటం లేదు. వాటిని చూడటం లేదా అంటే చూస్తూనే ఉన్నావు. కాని వాటన్నింటిలో సమానంగా అవిభక్తంగా వ్యాపించిన

Page 447

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు