#


Index

మోక్ష సన్న్యాస యోగము

కమ్ముకొని ఉంది. కనుకనే అది అవ్యయం. మార్పు లేదు దానికి. విశేషమైతేనే మారుతుంది. సామాన్యమైనది మారదు. కారణమేమంటే విశేషాలకున్నట్టు దానికి నామరూపాలుండవు.

  అంతేకాదు. అవిభక్తం విభక్తేషు. ఇవి ఎక్కడి కక్కడ వేర్వేరుగా కనపడుతుంటా యీ విశేషాలు. ఘటం పటం గాదు. పటం గృహం కాదు. గృహం వనం గాదు. కాని అవన్నీ అలా ఒకటి మరొకటి కాదనిపించు కొంటున్నా - అన్నీ నేనే అనిపించుకొనే దొకటున్నది. ఎక్కడో గాదు. వాటిలోనే. ఏమిటది. సచ్చిత్తులు. అంటే అర్థం. అవన్నీ ఉన్నాయనే స్ఫురణ. అలాటి స్ఫురణ లేని పదార్ధమేదైనా ఉందేమో చెప్పండి చూతాము. ఘటోస్తి పటోస్తి - ఘటోభాతి పటో భాతి అనే చూస్తున్నావుగా ప్రతి ఒక్కటీ లోకంలో. ఇక సచ్చిదాత్మకం గాని పదార్ధమే ముందని. అయినా ఘటం పట మంటున్నావంటే సచ్చిత్తులనే ఘట పటాది రూపంగా చూస్తున్నావు. ఇందులో ఏది ఆ రూపాలలో కనిపిస్తున్నదో అది వాటి స్వరూపం. అది ఎన్ని రూపాలలో కనిపిస్తున్నదో అవన్నీ దాని ఆభాస లేదా విభూతి. అప్పటికి రెండూ వేర్వేరు పదార్ధాలు కావు. ఒకటి వస్తువు. మరొకటి ఆ వస్తువు తాలూకు విస్తారం. వస్తువే విస్తరిస్తే విభూతి. విభూతే సంకోచిస్తే స్వరూపం. సూర్యమండలం స్వరూపమైతే సర్వవ్యాపకమైన ఆయన ప్రకాశం విభూతి అంటే రెండున్నాయనా సూర్యమండలాలు. లేక మండలం కన్నా ప్రకాశం వేరనా.

Page 446

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు