#


Index

మోక్ష సన్న్యాస యోగము

ఇలా చెప్పటంలో మహర్షి వివక్షిత మేమంటే వీటిలో సాత్త్వికమైన దేదో అది పట్టుకోండి అదే మీ సాధన మార్గాని కుపకరిస్తుంది మిగతా రాజసతా మసాలు కావని మనలను హెచ్చరించటానికి.

సర్వభూతేషు యే నైకం భావ మవ్యయ మీక్షతే
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ -20

  మొట్టమొదట జ్ఞానంలో ఉండే మూడు భేదాలూ వర్ణిస్తున్నాడు. అందులో మొదటిది సాత్త్వికమైన జ్ఞానం. ఇప్పుడిక చెప్పబోయే ప్రతి వర్గంలో సాత్త్విక మైనదే మనం గ్రహించవలసి ఉంటుంది. అదే సాధన మార్గంలో మనకు పనికి వచ్చేది. దాన్ని పట్టుకొంటేనే సాధకులుగా మనం ముందుకు సాగిపోగలం. గమ్యాన్ని చేరగలం. ఈ సూక్ష్మం మాత్రమే మరకుండా వింటూ పోవాలీ మూడు విధాలనూ మహర్షి వర్ణించి చెప్పేటప్పుడు. తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికం. సాత్త్వికమైన జ్ఞానమెలాంటిదో చెబుతున్నాడు. సర్వభూతేషు. సమస్త పదార్ధాలలో. అవి చేతనమే కావచ్చు అచేతనమే కావచ్చు. ఏకం భావ మవ్యయం. ఒకే ఒక భావం వ్యాపించి ఉంది. ఇవి అనేకమైతే అది ఏకం. ఇవి నామరూపాత్మకమైతే అది సచ్చిదాత్మకం. ఇవన్నీ వ్యక్తమై మనకు గోచరిస్తుంటే అది ఈ నామరూపాలను గోచరింప చేసే అవ్యక్తమైన తత్త్వం. ఇవి ఎక్కడికక్కడ విశేషరూపంగా తెగిపోతుంటే అది తెగకుండా తెగిపోయే వీటన్నింటినీ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు