కనిపిస్తుంది. ప్రస్తుతమిలాటి గుణాత్మకమైన దృష్టితో జ్ఞానకర్మాదులను విభజించి చూపుతున్నాడు మహర్షి
జ్ఞానం కర్మచ కర్తాచ - త్రిధైవ గుణ భేదతః
ప్రోచ్యతే గుణ సంఖ్యానే - యథాత చ్ఛృణు తాన్యపి -19
జ్ఞానమంటే బుద్ధి జ్ఞానం. బుద్ధిలో ఏర్పడే వృత్తులు. కర్మ అంటే వాటి ప్రసరణ. కర్త అంటే క్రియలన్నింటినీ నిర్వర్తించే అహంకార రూపుడైన జీవుడు. త్రిధైవ గుణ భేదతః గుణాలు మూడే కాబట్టి గుణాత్మకమైన ఈ జ్ఞానాదులు కూడా మూడే కావలసి ఉంది. ప్రోచ్యతే గుణ సంఖ్యానే. ఇది ఎవరు చెప్పారీ విభాగమంటే సాంఖ్య శాస్త్రజ్ఞులు చెప్పారు. గుణ సంఖ్యాన మంటే కపిలుని సాంఖ్య శాస్త్రమని పేర్కొన్నారు భాష్యకారులు. గుణభోక్తృ విషయంలో అది ప్రమాణమే మనకు. పరమార్థంలో అంతా బ్రహ్మమే ననే సత్యం వారంగీకరించక పోయినా వ్యావహారికంగా ప్రకృతి గుణాలూ వాటి ప్రభావం వల్ల జీవుడికి బంధమూ అపవర్గమూ ఏర్పడతాయని వర్ణించే టంత వరకూ వారితో అద్వైతులకు వైరుధ్యం లేదంటారాయన. ఇంతకూ గుణ సంపర్కం వల్లనే జ్ఞానాదులకు త్రైవిధ్యం. లేకుంటే ఏ భేదమూ లేదు వాస్తవంలో. గుణభేద కృతమైన త్రివిధ భేదమూ జ్ఞానంలో కర్మలో కర్తలో కారక సామగ్రిలో తద్ద్వారా కర్తకు ప్రాప్తించే ఫలానుభవంలో అన్నింటిలో క్రమంగా చెప్పబోతున్నాడిప్పుడు.
Page 445