#


Index

మోక్ష సన్న్యాస యోగము

కర్త అనీ మూడు మార్గాలలో కర్మ అభివ్యక్తమయి మనకు కనిపిస్తున్నది. కరణమంటే చక్షురాదీంద్రియాలు. కర్మ అంటే మనం ఫలితం పొందాలని కోరి చేసేది. కర్త అంటే దాన్ని నేను చేస్తున్నానని భావించే జీవుడు. ఇందులో మొదటి వరస సంకల్ప రూపంగా మనసులో ఏర్పడే భావన అయితే రెండవది దాని నమలుపరిచే బాహ్యమైన సామగ్రి. జ్ఞానమూ కర్మా రెండూ కలిపి చెబుతున్నాడు మహర్షి. ఒకటి అచలం మరొకటి చలం. అచలంగా ఉన్నంత వరకూ అది జ్ఞానం అది మన స్వరూపం. అదే బహిర్ముఖంగా చలిస్తూ పోతే కర్మ. అదే జ్ఞానం తాలూకు విభూతి.

  ఇందులో మొదట నేను జ్ఞాన స్వరూపుడ నంతకు మించి మరేదీ గాదు నా స్వరూపమని అక్కడికే ఆగిపోతే వాడు జ్ఞాని. జీవుడు కాదప్పుడు వాడు. ప్రత్యగాత్మ. అప్పుడు వాడి దృష్టికిదంతా వాస్తవంగాక ఆభాసగా దర్శనమిస్తుంది. అలా కాక మనఃప్రాణాదులైన ఉపాధులుకూడా తన స్వరూపమని భావించాడో వాడు ప్రత్యగాత్మ స్థాయి నుంచి జీవాత్మ స్థాయికి పడిపోతాడు. దానికి కారణం సత్త్వ రజస్తమస్సులనే ప్రకృతి గుణాలే. సత్త్వమే మనస్సు - రజస్సే ప్రాణం - తమస్సే శరీరమని గదా పేర్కొన్నాము. అవి నా ఉపాధులు గాక నేనే నా స్వరూపేమనని వాటితో తాదాత్మ్యం చెందానంటే నిర్గుణమైన నీ స్వరూపం గుణాత్మకంగా మారిపోతుంది. వస్తుతః మారకున్నా నీ దృష్టి గుణాత్మకం గనుక మారినట్టు

Page 443

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు