అనుభవిస్తాడు. ఏ కర్మ చేసినా అది వాడు గాదు చేయటం వాడి మనః ప్రాణాద్యు పాధులే చేస్తున్నాయి. అవే వాటి ఫల మనుభవిస్తున్నాయి. వాడు కేవలమా కర్మలన్నిటికీ సాక్షిగానే నిలిచి ఉంటాడని భంగ్యంతరంగా చెప్పటమిది. అంత మాత్రమే.
పోతే ప్రస్తుత మీ శరీరమనే ఉపాధిలో ప్రతిక్షణమూ జరిగే కర్మలన్నీ జరుపుతున్న దెవరు. జ్ఞానికేమీ సంబంధం లేదన్నారు గదా మీరు. మరి జ్ఞాని కాకుంటే ఈ శరీరంలో ఎవరుండి ఈ వ్యాపారాలన్నీ నిర్వర్తిస్తున్నారు. ఎవరను భవిస్తున్నారీ కర్మఫలమని ప్రశ్న వస్తున్నదిప్పుడు. దానికి సమాధాన మిస్తున్నదీ అనంతర శ్లోకం.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా - త్రివిధా కర్మ చోదనా
కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః - 18
ప్రతి ఒక్కటీ దేని ద్వారా తెలుసుకొంటున్నామో అది జ్ఞానం. అది దేన్ని గ్రహిస్తున్నదో ఏది దానికి గోచరిస్తున్నదో అది జ్ఞేయం. తధా పరిజ్ఞాతా. ఉపాధే నేననే అవిద్య వల్ల తయారయిన కర్తా భోక్తా జీవుడు. ఇవి మూడూ కర్మకు ప్రచోదకాలు. మూడూ ఉన్నప్పుడే ఒకటి కావాలని మరొకటి అక్కర లేదనే బుద్ధితో పనులన్నీ సాగిపోతుంటాయి.
అలాగే కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః అధిష్ఠానాదులైన అయిదింటిలో కర్మలన్నీ ప్రారంభ మవుతుంటే ఒక కరణమనీ కర్మ అనీ
Page 442