వాడు. అప్రాణో హ్యమనాః శుభ్రః అని చాటుతున్న దాత్మ తత్త్వాన్ని ఉపనిషత్తు. కాబట్టి ఒకటి చేస్తే తప్పేమో. దీనివల్ల నరకానికి పోవలసి వస్తుందే. అలాకాక ఈ పనిచేస్తేనే ఒప్పు. దీనిమూలంగా నేను స్వర్గానికి వెళ్లవచ్చుననే విశేష భావన ఉండగూడదు నీకు. దాని కనుశయమని Impression Tendency పేరు. సదా తద్భావ భావితః అని చెప్పినట్టు ఒకే భావాన్ని నిత్యమూ భావిస్తుంటే ఏర్పడుతుందది. అదే కొంపదీస్తుంది మానవుణ్ణి. ఆభాసగా కనపడవలసింది వస్తువుగా కనపడి వాణ్ణి భయపెడుతుంది. అదే అజ్ఞాన విలాసం. అలా కాక సచ్చిదాత్మకమైనదే తన స్వరూపం మిగతా దంతా దాని ఆభాసే నని చూచే దృష్టి గట్టిపడే వాడే జ్ఞాని.
హత్వాపి స ఇమాన్ లోకాన్. అలాటి జ్ఞాని ఈ లోకంలో ఏ ప్రాణిని హింసించినా అది హింస కాదు. న ని బధ్యతే. దానివల్ల వాడు బద్ధుడూ కాడు. హింసించట మేమిటి. అది జ్ఞానిని బంధించదని చెప్పటమేమిటి. పరస్పర విరుద్ధంగా లేదా ఈ మాట. లేదు. దృష్టి భేదంతో రెండూ కరెక్టే నంటారు భగవత్పాదులు. లౌకిక దృష్టి ననుసరించి హింసించటమూ కరెక్టే. పారమార్థికమైన దృష్టితో చూస్తే నహంతి నని బధ్యతే హింసా లేదక్కడ. అది వాణ్ణి కట్టివేయటమూ లేదనే మాటా కరెక్టే. అది కూడా కాదు. చమత్కారంగా చెబుతున్న మాట ఇది. హింసించినా అది హింస కాదని. జ్ఞాని అయిన వాడస లెవరిని గానీ ఎందుకు హింసిస్తాడు. దాని ఫలితమెలా
Page 441