#


Index

మోక్ష సన్న్యాస యోగము

  సుమతి ఎవడంటే సంస్కృతమైన బుద్ధి ఉన్నవాడు. శరీరంలో ఏది కర్తో ఏది కాదో వివేచన చేసి సాక్షిరూపమైన తన ఆత్మను గుర్తించిన వాడు. వాడే జ్ఞాని. వాడి దృష్టి కధిష్ఠానాదు లయిదూ వాటి వ్యాపారాలతో సహా నిష్క్రియ మైన నిర్వికారమైన తన స్వరూపం మీద కల్పితమైన పదార్ధాలే. అందులోనే ఉంటున్నా తాను అవి ఏవీ తాను గాదు. కారణం తాను జ్ఞానస్వరూపుడు. అవన్నీ జ్ఞానం కావు. తన జ్ఞానానికి గోచరించే జ్ఞేయ పదార్ధాలు. అలాటి జ్ఞేయమైన మనః ప్రాణాదులనే నేనని వాటితో తాదాత్మ్యం చెందడు జ్ఞాని. కనుకనే యస్యనాహం కృతో భావః - వాడి జ్ఞానం నేనే ఈ కర్మకు కర్తనని బోల్తా పడదు. అంతేకాక బుద్ధి ర్యస్యస్యన లిప్యతే అలా పడకుండా ఉండాలంటే బుద్ధి అనే దొకటి తన చెప్పు చేతల్లో ఉండాలి. బుద్ధే ఆత్మ కుపాధి. ఆత్మ కాదది. ఆత్మ లాగా అభినయిస్తుంటుంది.

  దాని అభినయం చూచి అది అభినయమని తెలియక దానినే ఆత్మ అని భ్రమపడతా డజ్ఞాని అయిన మానవుడు జ్ఞాని అయితే అలా భ్రమపడడు. దాన్ని కూడా కేవలం ఒక ఉపాధిగా చూస్తాడు. అప్పుడా బుద్ధికి సోకే సుఖ దుఃఖాది భావాలేవి గాని ఆత్మకు సోకవు. బుద్ధి లిప్తమైనా ఆత్మ లిప్తం కాదనే భావన ఉంటుంది వాడికి. అలా ఉన్నవాడే జ్ఞాని. బుద్ధితో సహా అన్నీ వాడి కుపాధులే. వాటి వ్యాపారాలకు కేవలం సాక్షి

Page 440

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు