భావం. ఒక దాని కొకటి కనిపిస్తుంటుంది వాడి బుద్ధికి. అలాటి బుద్ధి పెట్టుకొని చూడబోతే సాక్షి స్వరూపమైన ఆత్మ ఎలా కనిపిస్తుంది వాడికి. నసపశ్యతి. చూడలేడు వాడు దాన్ని. సాక్షిగా చూడటానికి బదులు కర్తారం పశ్యతి. దానినే కర్తగా భోక్తగా భావిస్తాడు.
దీనికొక చక్కని ఉపమానం చెబుతారు భాష్యకారులు. యధా అబ్రేషు ధావత్సు చంద్రం ధావంతం - యథావా వాహనే ఉపవిష్టః అన్యేషు ధావత్సు ఆత్మానం ధావంతం. ఆకాశంలో మబ్బులు పరుగెడుతుంటే వాటితో పాటు చంద్రుడు కూడా పరుగెడుతున్నట్టు చూస్తుంటాము. అలాగే మనమొక వాహన మెక్కి కూచొని అది కదలిపోతుంటే మనమూ కదలిపోతున్నట్టు కూడా భావిస్తుంటాము. ఒక దానిలో జరిగే పని మరొక దాని కారోపించటమంటే ఇదే. ఆరోపించింది సత్యమెలా కాదో అలాగే అధిష్ఠానాదు లయి దింటిలో జరిగే ప్రతి పనీ వాటన్నిటికీ సాక్షిగా ఉన్న మన ప్రత్యగాత్మకు కూడా ఆరోపించి అదే కర్త అని భావించటం కూడా వాస్తవం కాదు. అలా భావించేవాడు దుర్మతి అంటున్నాడు మహర్షి మరి ఎవడు సుమతి అని ప్రశ్న వస్తే చెబుతున్నాడు వినండి.
యస్య నాహం కృతో భావో - బుద్ధిర్యస్యన లిప్యతే
హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి నని బధ్యతే - 17
Page 439