#


Index

మోక్ష సన్న్యాస యోగము

అశాస్త్రీయమైతే అధర్మం. ఏదైనా సరే. న్యాయ్యంవా విపరీతంవా అంటున్నాడు. ఈ త్రికరణాలతో చేసే ఏ కర్మ అయినా మానవుడు ప్రారంభించి చేస్తున్నాడంటే దాన్ని ఆది నుంచి అంతం దాకా నడుపుతూ ఉన్న కారణాలూ ఈ అధిష్ఠానాదులైదే. మరేదీ గాదు. అంటే అప్పటికి మానసికమైన ఆలోచనలో ఈ అయిదే ఉంటాయి. వాగ్వ్యాపారంలో ఇవే ఉంటాయి. శారీరకమైన క్రియలో ఈ అయిదే ఉంటాయి. అవే నడుపుతుంటాయి మనోవాక్కాయ వ్యాపారా లన్నింటినీ.

తత్రైవం సతి కర్తార - మాత్మానం కేవలంతు యః
పశ్యత్యకృత బుద్ధిత్వా - న్నస పశ్యతి దుర్మతిః - 16

  తత్రైం సతి. ఇది ఇలా ఉండగా ఆత్మానం కేవలం తు యః సాక్షిరూపంగా పరిశుద్ధంగా ఉన్న తన ఆత్మ నెవడైతే కర్తారం పశ్యతి ఆ కర్మలన్నింటికీ కర్తనని భావిస్తాడో. ఎందుకని అలా భావిస్తాడు. అకృత బుద్ధిత్వాత్ - ఆత్మ అనేది కేవలం కర్మకు సాక్షియే గాని కర్తగాదనే బుద్ధి లేక. అలాటి వాడి కకృత బుద్ధి అని పేరు. కృతమంటే ఇక్కడ సంస్కృత మని అర్థం. ఏది కర్తో ఏది కేవలం సాక్షో గుర్తించటమే సంస్కారం. అలాటి సంస్కారమెప్పుడా బుద్ధికి లోపించిందో అప్పుడు సాక్షినే కర్తగా భావించి బోల్తా పడతాడు మానవుడు. పడ్డాడంటే నస పశ్యతి దుర్మతిః వాడు దుర్బుద్ధి. అంటే బుద్ధి సరియైన మార్గంలో పనిచేయటం లేదని

Page 438

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు