చెబుతున్నారీ అయిదు విధములైన కర్మ కారణ విషయమూ. ఎందుకంటే సిద్ధయే సర్వ కర్మణాం -మనం చేసే కర్మలన్నీ జరగలాంటే వాటి మూలంగానే జరుగుతుంటాయి. అందులో ఏది లోపించినా కర్మ ముందుకు సాగదు. అంచేత అవి అయిదూ ఏమిటో తెలుసుకో వలసిఉంది మనం.
అయితే ఏమిటా అయిదూ. ఒకటి అధిష్ఠానం మన శరీరమే అది. అక్కడే జరుగుతుందే కర్మ అయినా. రెండు కర్త. పని చేసే జీవుడు. కర్తావాడే భోక్తా వాడే. మూడు కరణం. కరణంచ పృథగ్విధం. కరణమంటే ఇంద్రియం. త్వక్చక్షురాదులైదూ - వాక్పాణ్యాదులైదూ. మనః ప్రాణాలు రెండూ - మొత్తం పన్నెండు ఇంద్రియాలివి. వీటికే కరణము లని పేరు. కర్మ చేయటానికి సాధన సామగ్రి ఇది. పోతే వివి ధాశ్చ పృథక్చేష్టాః ప్రాణా పానాదులైన వాయువుల కదలిక లేవున్నాయో అవి నాలుగవది. దైవం చైవాత్ర పంచమం. ఇక అయిదవది దైవం. ఆధి దైవికమైన శక్తులు. Cosmic powers. ఇంద్రియాలను వాటి వాటి మార్గంలో నడిపే శక్తులవి సూర్యచంద్రాగ్ని వరుణాదులు.
శరీర వాఙ్మనోభిర్య - త్కర్మ ప్రారభతే నరః
న్యాయ్యంవా విపరీతం వా పంచైతే తస్యహేతవః - 15
శరీరమూ వాక్కూ మనస్సూ - వీటికి త్రికరణాలని పేరు. ఎవడే పనిచేసినా అది ధర్మమే కావచ్చు. అధర్మమే కావచ్చు. శాస్త్రీయమైతే ధర్మం.
Page 437