కాబట్టి వారికే కర్మలూ లేవు. కర్మఫలాను భవ మంత కన్నా లేదు. అంతా ఆత్మ స్వరూపంగా ఏకమే. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నట్టు వారి జ్ఞాన సాగరంలో త్రివిధ కర్మలూ త్రివిధ ఫలాలూ గంగా యమునా సరస్వతులలాగా ప్రవేశించి ఊరు పేరు లేకుండా ప్రవిలయమయి పోతాయి. ఇదీ విషయం.
పంచైతాని మహాబాహో - కారణాని నిబోధమే
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని- సిద్ధయే సర్వకర్మణామ్ - 13
అధిష్ఠానం తథా కర్తా- కరణంచ పృథగ్విధం
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ - 14
అలాకాక ఆత్మజ్ఞాన దృష్టి ఏ మాత్రమూ లేక బ్రతికే అజ్ఞానికి మాత్రం కర్మ బంధం తప్పదు. అంతా ఆత్మ స్వరూపమే ననే అద్వైత జ్ఞానం లేనందు వల్ల వాడికి సర్వమూ క్రియా కారక ఫలాత్మకంగానే కనిపిస్తుంటుందీ ప్రపంచం. అంచేత కర్మ సన్న్యాస మెప్పుడూ అసంభవమే వాడి దృష్టిలో. అలాటి పామరులంతా కర్మ చేయక తప్పదు కాబట్టి పంచైతాని కారణాని. కర్మకు దేనికైనా కారణాలు అయిదున్నాయి. అవి అయిదూ సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. సాంఖ్యమంటే ఇక్కడ వేదాంతమని అర్థం. అది కృతాంతం. కృతమంటే కర్మ. దానికంతం ఆత్మజ్ఞానం.అలాంటి ఆత్మ స్వరూపాన్ని చెప్పే శాస్త్రమే సాంఖ్యమైన కృతాంతమంటే. అందులో
Page 436