మిశ్రం. పోతే అటూ ఇటూ గాని మానవ జన్మ ఎత్తి సుఖదుఃఖాది ద్వంద్వానుభవంతో కూడిన ఫలం. భవతి అత్యాగినాం. ఏమాత్రమూ త్యాగబుద్ధి లేక భోగబుద్ధితో బ్రతికి పోయే వాడికి కలిగే కర్మ ఫలానుభవమిది. ప్రేత్య. చచ్చిన తరువాత ప్రాప్తించేది.
త్యాగ బుద్ధి లేదని గదా చెబుతున్నారు. అందులో మరలా ఉత్తమ మధ్యమాధమ ఫల భేదమెలా వచ్చిందని శంకించరాదు. ఎందుకంటే ఆత్మ జ్ఞాన మొకటి లేదనే గాని వారంతా కర్మిష్ఠులు. వేదోక్త కర్మ లాచరిస్తున్న వారు. ప్రత్యగాత్మ ఏమిటో తెలియదే గాని జీవాత్మ జ్ఞానముంది కావలసినంత. నేను కర్తనూ నాకీ ఫలితం సిద్ధించాలనే ఫల కామనతో శాస్త్రోక్త మార్గంలో చేస్తారు కొందరు. వారుత్తములు. వారికా కర్మలకు తగిన స్వర్గాది భోగాలు కలిగి తీరుతాయి. అలాకాక శాస్త్రీయమైన అశాస్త్రీయమైన రెండు మార్గాలలో కర్మలు సాగించేవారికి మిశ్రఫలమైన మనుష్య జన్మ వారి కర్మాను గుణంగానే ప్రాప్తిస్తుంది. మరి కేవల స్వార్ధ బుద్ధితో అశాస్త్రీయమైన మార్గంలో కామ్యనిషిద్ధ కర్మలు చేయటానికి కూడా వెనుదీయని వారికి దానికి తగినట్టే పశుమృగాది జన్మలు ప్రాప్తించటంలో ఆశ్చర్యం లేదు. ఏది చేస్తే అది. ఎంత చేస్తే అంత.
పోతే నతు సన్న్యాసి నాం క్వచిత్. జ్ఞానులయి సర్వసంగ పరిత్యాగులైన మహానుభావు లన్ని కర్మలూ జ్ఞాన దృష్టితో సన్న్యసిస్తారు
Page 435