మాసించగూడదు. దాన్ని ఈశ్వరుడి కర్పించగలిగి ఉండాలి. ఈశ్వరు డొకడున్నాడు. వాడు నాలో చేరి నా చేత ఈ కర్మ చేయిస్తున్నాడు. వాడు చేయిస్తుంటే నేను చేస్తున్నాను. దీని ఫలం కూడా వాడికే సమర్పయామి అనే భావనతో చేయాలి వాడే కర్మ చేసినా. కర్మ త్యాగం కాక కర్మ ఫల త్యాగం చేయగలిగినా వాడు త్యాగే.
అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ - 12
సిద్ధుడయి సకల కర్మలూ సన్న్యసించిన వాడికే ఫలితముంటుంది. సిద్ధుడు కాక ఫలాన్నైనా వదులు కోలేని వాడికేమి ఫలితమనేది ప్రస్తుతం నిర్ణయించి చెబుతున్నాడు మహర్షి. కర్మనూ త్యజించలేక కనీసం కర్మ ఫలాన్ని కూడా త్యజించ లేనివాడు పామరుడు. సాధకుడూ కాదు వాడు. సిద్ధుడసలే కాడు. అలాటి వాడికి మాత్రం కర్మ పాశం మెడకు చుట్టుకొంటుంది. ఫలాపేక్షతో చేస్తుంటాడు కాబట్టి ఏ కర్మ చేసినా దానికి తగిన ఫలముండి తీరుతుంది. అది అనుభవించక తప్పదు వాడు.
ఏమిటా ఫలం ఎన్ని విధాలు. అనిష్ట మిష్టం మిశ్రంచ త్రివిధం. మూడే మూడు విధాలది. ఒకటి అనిష్టం పశుమృగాది యోనుల లోబడిపోయి నానాయాతన లనుభవించే దారుణమైన ఫలితం. ఇష్టం. దేవమున్యాది జన్మలెత్తి దివ్య భోగాలను భవించే ఉత్కృష్టమైన ఫలం.
Page 434