#


Index

మోక్ష సన్న్యాస యోగము

నిషిద్ధ కర్మలలాగే పరిత్యజించగలడు. ఇరువురినీ బాధించదీ కర్మ అనేది. ఎందుకంటే వారి దృష్టికదంతా జ్ఞాన స్వరూపమే. శరీరమనే ఉపాధి ఉంది గదా ఎలా చూడగలడంతా ఆత్మ స్వరూపంగా నని ఆశంక కలగవచ్చు. కాని దేహేంద్రియాదులను కూడా మిగతా బాహ్య పదార్ధాలను చూచినట్టు కేవల మస్తితి అని ఆత్మాకారంగానే దర్శించగలడు వాడు. అలాటి విద్య ఉంది వాడి దగ్గర. దేహాది సంఘాతం కనిపించదని గాదు. కనిపిస్తున్నా తన జ్ఞాన దీప్తి చిమ్మిన ఒక నీడలాగా చూస్తుంటాడు దాన్ని. ఇదీ వాడి వ్యవహారం.

  పోతే సాధకుడూ సిద్ధుడూ వారిద్దరి స్థాయినీ అందుకోలేక లౌకికంగా బ్రతికే మూడవ జాతి మానవుల విషయ మిప్పుడు వర్ణిస్తున్నాడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణి. దేహభృతా అంటే దేహమున్న వాడని గాదు. దేహమేనని అభిమాన మున్నవాడు. వాడు మాత్రం మానస వాచిక కాయిక కర్మ లేవీ మానుకోలేడు. కర్మలు వదులు కోటమనేది వాడి కసంభవం. దేహాభిమానం అన్ని పనులూ చేయిస్తుంది వాడి చేత. అయితే వాడి గతి ఇంతేనా. వాణ్ణి కూడా కలుపుకోవాలి గదా మన మార్గంలో అంటే సానుభూతితో ఒక సలహా ఇస్తున్నది గీత. యస్తు కర్మ ఫలత్యాగీ సత్యాగీ కర్మలెలాగూ చేయక తప్పదు కాబట్టి శాస్త్ర చోదితమైన కర్మలాచరించటం వరకే తన కర్తవ్యంగా భావించి వాడు దాని ఫలిత

Page 433

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు