అంచేతనే త్యాగీ సత్త్వ సమావిష్టః - సత్త్వమనేది వాణ్ణి ఆవేశించి ఉంటుందెప్పుడూ. సత్త్వమంటే ఆత్మానాత్మ వివేక విజ్ఞానానికి నిమిత్తమైనదేదో అది అంటారు భాష్యకారులు. ఆత్మను వివేచన చేసిన మరుక్షణ మనాత్మ ఇక లేదు. అది కూడా ఆత్మే అవుతుంది. అలాటి ఏకాత్మ భావన ఉన్నవాడు కనుకనే త్యాగీ. త్యాగమనేది అప్రయత్నంగా చేయగలడు. కర్మను కర్మగా చూడక జ్ఞానంగా చూడటమే అసలైన కర్మ త్యాగం. మేధావీ. అయితే మేధా సంపత్తి ఉండాలి దానికి. మేధా అంటే ఆత్మ జ్ఞాన లక్షణా ప్రజ్ఞా అని అర్థం వ్రాస్తున్నారు స్వామివారు. ఛిన్న సంశయః - అలాటి ఆత్మ జ్ఞానముంటే మరి సంశయమెక్కడ ఉంటుంది. అజ్ఞానం వల్లనే గదా అన్ని సంశయాలూ. ఆత్మజ్ఞానంలో దానికి ప్రవేశమే లేదు.
నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః
యస్తు కర్మ ఫల త్యాగీ సత్యాగీ త్యభిధీయతే - 11
అయితే ఇప్పుడొక సూక్ష్మాన్ని గుర్తించాలి మనమీ కర్మ విషయంలో. కర్మ యోగంతో చిత్తశుద్ధి చేసుకొని అది జ్ఞానోదయానికి దారి తీస్తే క్రమంగా అందులో ఆరితేరిన సాధకుడికీ లేదు కర్మబంధం. వాడూ దీన్ని జ్ఞాన విభూతిగా దర్శించి కర్మలన్నీ వదులుకోగలడు. మరి మొదటి నుంచీ శ్రవణ మనన నిది ధ్యాసలు చేసి జ్ఞాని అయిన ఉత్తమాధికారీ నిత్యాది కర్మలన్నీ
Page 432