#


Index

ఉపసంహారము

కాదన్న మాట. జ్ఞానమే జీవితం. అదే యజ్ఞం. జ్ఞాన యజ్ఞం Divine life. అసలైన దివ్య జీవన మది. ఇది ఎప్పుడో చాటిచెప్పింది గీత.

  ఇక గీత మనకు చెప్పవలసిన దేముంది. జీవితానికి కావలసిన సమస్తమూ చెప్పింది. జీవిత సమస్యా చెప్పింది. పరిష్కారమూ చేసి చూపింది. సాధన మార్గమూ బోధించింది. దానివల్ల కలిగే ఫలసిద్ధి నిరూపించింది. అది కూడా సిద్ధమే గాని క్రొత్తగా సాధించవలసిన అక్కర లేదనీ వర్ణించింది. ఆ సాధన కూడా కేవలం దృష్టిలో మార్పే గాని మరేదీ కాదనే సూక్ష్మం కూడా బయటపెట్టింది. ఆఖరుకు ముక్తి అనేది జీవితానంతరం కాదు. జీవించి ఉండగానే లభిస్తుంది. అది కూడా నీదగ్గర గుప్తంగా ఉన్నదే ప్రకటమై అనుభవానికి వస్తుందంత కన్నా ఏమీ కాదనీ చాటి చెప్పింది. ఇంతకన్నా చెప్పవలసిందే ముంది గీత మనకు. ఇదే గీతా సర్వస్వం. ఇదే మానవ జీవిత సర్వస్వం. పోతే అదెవరికి వారం మన సర్వస్వమని గుర్తించటమే పురుషార్ధ సర్వస్వం - ఏతావతా భవత స్సర్వా నను జ్ఞాపయతే

భవదీయః
శ్రీనివాసధేయః
విబుధ జన విధేయః

Page 544

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు