#


Index

ఉపసంహారము

  జ్ఞానమూ యజ్ఞమన గానే మనకు పరిపరి విధాల పోతుంటుంది మనసు. యజ్ఞమంటే భౌతికమైన పరికరాలతో శారీరకంగా చేసే అనుష్ఠాన,ం కాదని ఇంతకు ముందే త్రోసి పుచ్చాము. తెలిసింది గదా. పోతే ఇక జ్ఞానమనే మాట అలాగే కచ్చితం చేసి చెప్పాలి. భగవద్గీత జ్ఞానమనే మాట ఎక్కడైనా పేర్కొన్నదంతే అది మనమనుకొనే లోకజ్ఞానం కాదు. లేదా తర్కవ్యాకరణ వైద్య జ్యోతిష భౌతిక రసాయనాది శాస్త్ర జ్ఞానమూ కాదు. లేదా సంగీత శిల్ప సాహిత్యాది కళా జ్ఞానమూ కాదు. లేదా జప తపోయజ్ఞయాగాది ధర్మపురుషార్థ జ్ఞానమంత కన్నా కాదు. ఇవేవీ కావు జ్ఞానమంటే. ఒక్క ఆత్మజ్ఞానమే జ్ఞానం. అదీ అనాత్మను వేరు చేసిన ఆత్మ కాదు. ఆత్మానాత్మలు రెండూ ఏకమని దర్శించే సర్వాత్మ జ్ఞానం. అది ఒక్కటే జన్మ తారకం. మిగతా జ్ఞానాలన్నీ మారకమే తారకంకావు. ఇవన్నీ సాపేక్షమైతే అది నిరపేక్షం. ఇవి ఆయా విశేష విషయాలకు సంబంధించినవైతే అది ఒక్కటే సర్వ విశేష సంగ్రాహకమైన సామాన్య జ్ఞానం.

  అసలేది సమస్త దుఃఖాపనోద కమూ సంపూర్ణ సుఖాపాదకమో అలాటి జ్ఞానమే జ్ఞానమవుతుంది గాని తతిమావి జ్ఞానమెలా కాగలవు. భగవద్గీత ప్రస్తుత మలాటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది మనకు. యద్ జ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవ శిష్యతే- ఏది గ్రహిస్తే మానవుడిక

Page 542

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు